Home టాప్ స్టోరీస్ కలాం మీకు ఇదే మా సలాం : రాకెట్ వీరుడి విశ్వగాధ

కలాం మీకు ఇదే మా సలాం : రాకెట్ వీరుడి విశ్వగాధ

APJ Abdul kalam

ఎంతో మంది పుడుతుంటారు. చ‌నిపోతుంటారు. అలా మామూలుగా పుట్టిన వారి నుంచే నాయ‌కులు, ఆద‌ర్శ‌వంతులు, గొప్ప వ్య‌క్తులు అవుతారు. ఎద‌గాల‌నే క‌సి ఉంటే చాలు….మ‌రేది మీ ల‌క్ష్యానికి అడ్డుప‌డుదు అంటుంటారు. దీనికి స‌రైన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తారు మన దివంగ‌త రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం. ఆయ‌నో ఆజాత శ‌త్రువు. అంటే ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క శ‌త్రువు కూడా లేనివాడు. ఇప్పుడు మ‌న దేశ అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ఇస్రో సాధిస్త‌న్న విజ‌యాల‌కు పునాదులు వేసింది కూడా ఈయ‌నే. అత‌ని జీవితం మొత్తం మీద ఒక విమ‌ర్శ కూడా లేని వ్య‌క్తి . ఇప్ప‌‌టివ‌ర‌కు ఎంతో మంది రాష్ట్ర‌ప‌తిలు ప‌ని చేశారు. కానీ అబ్దుల్ క‌లాంలా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన వ్య‌క్తి ఎవ‌రు లేరు. పేద కుటుంబంలో పుట్టిన దేశ ప్ర‌ధ‌మ పౌరుడిగా ఎలా ఎదిగాడు…… ఒక గొప్ప నాయ‌కుడిగా , శాస్త్ర‌వేత్త‌గా ఎలా మారాడు….రామేశ్వ‌రం నుంచి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు సాగిన ఆయ‌న జీవిత చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకందాం.


1931 అక్టోబ‌ర్ 15న త‌మిళ‌నాడు రాష్ట్రం రామేశ్వ‌రంధలో ఉన్న ఒక ముస్లీం కుటుంబంలో అబ్దుల్ క‌లాం పుట్టారు. నిరుపేద కుటుంబం. ఈయ‌న తండ్రి పేరు జైనులుద్దీన్‌. ఈయ‌న ప‌డ‌వ న‌డిపేవారు. త‌ల్లి ఆశ‌మ్మ‌. కలాం పూర్తి పేరు ఔల్ ఫ‌కీర్ జైన‌లుద్దీన్ అబ్దుల్‌క‌లాం. ఆర్థికంగా వెనుక‌బ‌డిన కుటుంబానికి సాయం చేసేందుకు…… క‌లాం చిన్న‌వ‌య‌సులోనే పేప‌నర్లు వేశాడు. రామేశ్వ‌రం కొద్ది దూరంలో ఉన్న రామ‌నాథ‌పురంలో స్క్వార్ట్జ్ మెట్రిక్యూలేష‌న్ స్కూల్‌లో ……ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్నాడు.
చ‌దువు చ‌దువు అంతంత‌మాత్ర‌మే .కానీ కొత్త విష‌యాలు నేర్చుకోవాల‌నే ఆస‌క్తి చాలా ఉండేది. ఒక టీచ‌ర్ స‌ముద్ర‌పు ఒడ్డును తీసుకెళ్లి ప‌క్షి ఎలా ఎగురుతుందో చూపించాడు. అప్ప‌టి నుంచే తాను కూడా ఆకాశంలో ఎగ‌రాల‌నుకున్నాడు. అందుకోసం బాగా చ‌దివి ఉన్న‌త స్థాయికి వెళ్లాల‌ని అనుకున్నాడు.

APJ Abdul Kalam 1280x720 1


త‌ర్వాత తిరుచ్చిలో సెయింట్ జోస‌ఫ్ కాలేజీలో డిగ్రీ ప‌ట్టా పొందాడు. ఫైల‌ట్ అవ్వాల‌ని త‌న చిన్న‌నాటి కోరిక‌ను నిజం చేసుకోవ‌డం కోసం….. మ‌ద్ర‌స్‌లోని ఎంఐటీలో చేరాల‌నుకున్నాడు. అయితే అక్క‌డ చేరాలంటే వెయ్యి రూపాయ‌ల ఫీజు క‌ట్టాల్సి వ‌చ్చింది. తండ్రి ఏమో క‌ట్ట‌లేని ప‌రిస్థితి. అలాంటి స‌మ‌యంలో క‌లాం….. అక్క త‌న గాజుల‌ను తాక‌ట్టు పెట్టి ఫీజు క‌ట్టింది. త‌న‌ను బాగా చ‌దివించాల‌ని..ఉన్న‌త మైన స్థానానికి చేరితే చూడాల‌ని ….. కుటుంబ‌స‌భ్యుల ప‌డుతున్న క‌ష్టాన్ని చూసి……. త‌న మీద వార‌కున్న న‌మ్మ‌కాన్ని చూసి క‌లాం ఎంత‌గానో చెలించిపోయాడు. చివ‌రికి క‌లాం చివ‌ర‌కు స్కాల‌ర్ షిప్ సాయంతో…… ఎంఐటీలో ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్‌ను పూర్తి చేశాడు. ఎయిరోనాటిక్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల్లో ఎనిమిది ఉద్యోగాలు ఉంటే …….త‌న‌కు తొమ్మిదివ స్థానం రావ‌డంతో తృటిలో ఫైల‌ట్ అయ్యే అవ‌కాశాన్ని కోల్పోయాడు. అలా కొద్దిపాటిలో త‌న చిన్న‌నాటి క‌ల చేజారిపోయింది.


1960లో క‌లాం డీఆర్‌డీవో లో ఎయిరోనాటిక‌ల్ డెవెల‌ప్‌మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్‌లో శాస్త్ర‌వేత్త‌గా జాయిన్ అయ్యారు. భార‌త సైన్యానికి ఓవ‌ర్ క్రాఫ్ట్ త‌యారు చేయ‌డం ఆయ‌న బాధ్య‌త‌. తర్వాత కొన్నాళ్ల‌కు ఇండియన్ నేష‌న‌ల్ క‌మిటీ ఫ‌ర్ స్పేస్ రిస‌ర్చ్ నుంచి క‌లాంకు ఇంట‌ర్వూకి ర‌మ్మాని పిలుపు ఇచ్చింది. అదే ఇప్పుడు ఇస్రోగా మారిపోయింది. అబ్దుల్‌క‌లాంను ప్రొఫెస‌ర్ విక్ర‌మ్ సారాభాయ్ ఇంట‌ర్వ్యూ చేశారు. దాంటో్లో రాకెట్ ఇంజినీర్ గా ఎంపిక అయ్యారు. విక్ర‌మ్ సారాభాయ్‌, క‌లాం క‌లిసి ఇస్రోను డెవ‌ల‌ప్ చేశారు. ఈ క్ర‌మంలో ఆరు నెల‌ల పాటు ట్రైనింగ్‌కో్సం రాకెట్ లాంచింగ్ టెక్నిక్స్ కోసం…… అమెరికాలోని నాసాకు వెళ్లే అవ‌కాశం క‌లాంకు దొరికింది. భార‌త‌దేశం నుంచి అంత‌రిక‌క్షానికి రాకెట్‌ను పంపాల‌నేది సారాభాయ్ ఆశ‌. ట్రైనింగ్ కి వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత క‌లాం…… సారాభాయి్, స‌తీశ్ ధావ‌న్ సాయంతో రోహిణి అనే శాటిలైట్‌ను అంత‌రిక్షంలో పంపేందుకు ఎస్ఎల్ వీ త్రి అనే రాకెట్ ను త యారు చేశారు.

images 1571123221547 abdul kalam

దేశంలోని ప్ర‌జ‌లంద‌రి క‌ళ్లు ఈ ప్ర‌యోగంపైనే ఉన్నాయి. అబ్దుల్ క‌లాంతో పాటు అక్క‌డున్న ఎంతో మంది క‌ష్ట‌ప‌డి నిర్మించిన 22 మీట‌ర్ల పొడ‌వునున్న ఎస్ ఎల్ వీ 3 లాంచ్ అయ్యింది. కానీ 315 సెక‌న్ల త‌ర్వాత సెకండ్ స్టేజ్ త‌ర్వాత పేలి పోయి….. స‌ముద్రంలో కుప్ప‌కూలిపోయింది. ఒక్క‌సారిగాక‌లాం గారికి ఏదో తెలియ‌ని ఆవేద‌న‌. త‌న‌తో పాటు త‌న దేశ ప్ర‌జ‌ల క‌ల‌ల‌న్నీ ఆవిరైపోయాయ‌నే బాధ‌. కానీ క‌లాం నిరూత్సాహ‌ప‌డ‌లేదు. 1980లో తిరిగి రెండో ప్ర‌యోగం కోసం ఎస్ఎల్ 3ని త‌యారు చేశారు. ఆరోజూ న్యూస్ పేప‌ర్ల‌న్నీ మొద‌టిదానిలాగానే ఇది కూడా తుస్ మంటుంద‌ని హీనంగా రాశాయి. దేశం క‌ళ్ల‌న్నీ ఈ ప్ర‌యోగం పైనే ఉన్నాయి. 18 జూలై 1980లో ఎస్ ఎల్ వీ3 లాంచ్ అయి రోహిని శాటిలైట్‌ను ఆర్బిట్‌లో కి విజ‌య‌వంతంగా ప్ర‌వేశ‌పెట్ట‌గ‌లిగింది.

అంత‌రిక్షంలోకి రాకెట్ ను పంప‌గలిన దేశాల్లో మ‌న దేశం కూడా చేరింది. ఇక్క‌డే భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌కు పునాది ప‌డింది. అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీ క‌లాంకు ఫోన్ చేసి ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆ త‌ర్వాత 1981లో క‌లాంగారికి ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు వ‌రించింది. ఇక అప్ప‌టి నుంచి అబ్దుల్ క‌లాం వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఆయ‌న త‌యారు చేసిన రాకెట్ల‌లుగానే ఆయ‌న కూడా దూసుకోపోయాడు. ఇండియ‌న్ ఆర్మీ కోసం అగ్ని,పృధ్వీ, నాగ్ ,త్రిశూల్, ఆకాశ్‌లాంటి శ‌క్తివంత‌మైన మిసైల్స్ త‌యారు చేసి…మ‌న దేశాన్ని ఎవ‌రి మీద ఆధార‌ప‌డ‌కుండా శ‌క్తివంత‌మైన దేశంగా మార్చారు. అందుకే క‌లాంను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అభివ‌ర్షిస్తారు ఈయ‌న నాయ‌క‌త్వంలో ఇస్రో చాలా అభివృద్ధి చెందింది. ప‌ని చేసే స‌మ‌యంలో ఒక్క‌సారి కూడా త‌న స‌హ‌చ‌రుల‌పై కోప ప‌డ‌లేదని…… ఆయ‌న‌తో ప‌నిచేసిన వ్య‌క్తులు చెబుతుంటారు.

ఏదైనా వైఫల్యం వ‌స్తే ఓట‌మి బాధ్య‌త‌ను త‌న భుజంపై చేయి వేసుకున్నాడు. కానీ విజ‌యం సాధిస్తే మాత్రం ఆ ఫ‌లితాన్ని మొత్తం అంద‌రికీ అంకితం చేసేవాళ్లు. త‌న‌తో పాటు త‌న టీమ్‌లోని ప్ర‌తీఒక్క‌రూ పైకి వ‌చ్చేందుకు చేయూత ఇచ్చారు. అంతేకాదు కారు డ్రైవ‌ర్ డీఆర్‌డీవోలో ఉన్న స‌మ‌యంలో క‌దిరేష‌న్ అనే వ్య‌క్తి కారు డ్రైవ‌ర్ ను…ప‌ట్టుబ‌ట్టి మ‌రీ చ‌దువు పూర్తి చేయించాడు. ఆ డ్రైవ‌ర్ పీజీ వ‌ర‌కు పూర్తి చేసేంత వ‌ర‌కు క‌లామే ఫీజులు క‌ట్టాడు. ఇప్పుడు ఆ డ్రైవ‌ర్ విద్యా శాఖ‌లో పెద్ద పోస్టులో ఉన్నాడు.
1998లో వాజ్‌పేయ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు అమెరిక‌న్ శాటిలైట్స్ కు ద‌క్కుండా పోక్రాన్ అనే ప్ర‌దేశంలో …….ఆప‌రేష‌న్ శ‌క్తి అనే పేరుతో జ‌రిప‌న విజ‌య‌వంతంగా న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌లు చేయ‌డంలో క‌లాం పాత్ర చాలా కీల‌క‌మైన‌ది. దీంతో ఇండియా శ‌క్తి ఏంటోప్ర‌పంచ దేశాల‌కు అర్ధ‌మైంది.

క‌లాం ఎప్పుడూఒక‌టే చెబుతూ ఉండేవాడు. భార‌తీయులు పేద‌వాళ్లు కాదని…వారి ఆలోచ‌న‌లే పేద‌వ‌ని చెబుతూండేవారు. మ‌నం కూడా పెద్ద‌గా ఆలోచిస్తే ఏవైనా సాధించ‌గ‌ల‌వ‌చ్చ‌ని చెప్పేవారు. ఆ త‌ర్వాత‌కొన్నాళ్ల వ‌ర‌కు ప్ర‌ధానికి సైంటిఫిక్ అడ్వైజ‌ర్‌గా, డీఆర్‌డీవోకి ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించేవాడు. 2002 ఎన్నిక‌ల్లో జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో పోటీల్లో వాజ్‌పేయ్ బీజేపీ అభ్య‌ర్థిగా క‌లాం పేరును ప్ర‌తిపాదించ‌గా….ప్ర‌తిప‌క్ష కాంగ్ర‌రెస్ కూడా మ‌ద్ద‌తు తెలిపింది. అలా మ‌న దేశానికి క‌లాం మ‌న దేశానికి 19వ రాష్ట్ర‌ప‌తి 2002లో ఏక‌గ్రీవంగా ఎన్నికై…..2007 వ‌ర‌కు కొన‌సాగారు. ఏ రాజ‌కీయ అనుభ‌వం లేకుండా రాష్ట్ర‌ప‌తి అయిన మొద‌ట వ్య‌క్తి క‌లాం ఒక్క‌రే. రాష్ట్ర‌ప‌తి అయిన‌ప్ప‌టికీ చాలా సింపుల్‌గా ఉండేవారు. ఖ‌రీదైన గ‌దులు, సౌక‌ర్యాల‌ను వ‌దులుకుని ఒక సాధార‌ణ గ‌దిలోనే ఉండేవాడు. అక్క‌డ ఒక్కొక్క‌సారి అక్క‌డ ప‌ని చేసేవాళ్ల‌తో క‌లిసి కింద కూర్చొనే భోజనం చేసేవాడు. రాష్ట్ర‌ప‌తిగా ఎంత‌గా బబిజీగా ఉన్న‌ప్పేటికీ….చిన్న‌పిల్ల‌లు రాసిన ఉత్త‌రాల‌కు ఈయ‌నే స్వ‌యంగా జవాబులు రాసేవారు.

855442 abdul kalam azad

ఇన్నేళ్ల దేశ‌చిర‌త్ర‌లో ఇంత మంది ప్ర‌జ‌ల‌ను క‌లిసిన రాష్ట్ర‌ప‌తి క‌లాం ఒక్క‌ర.అందుకే ఈయ‌నున్న పీపుల్స్ ప్రెసిడెంట్ అంటారు. అయిన రాష్ట్ర‌ప‌తికి చేసిన ఐదేళ్ల‌లో ఏ ఒక్క అవినీతి మ‌ర‌క లేకుండా , విమ‌ర్శ‌గానీ లేని ఒకే ఒక్క వ్య‌క్తి క‌లాం. అంతేకాదు..త‌న‌కు రెండోసారి రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి వ‌రించే అవ‌కాశం వ‌చ్చినా కూడా…త‌నకిష్ట‌మైన పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌డ‌మే ఇష్ట‌మ‌ని ఏకంగా ఆ ప‌ద‌విని కూడా సున్నితంగా తిర‌స్కిరించారు. క‌లాంకి యువ‌త‌పై ఎంతో న‌మ్మ‌కం ఉండేది. అందుకే రాష్ట్ర‌ప‌తి ప‌దవి పూర్తి అయిన త‌ర్వాత విశ్రాంతి జీవ‌నం గ‌డ‌ప‌కుండా …….దేశ‌వ్యాప్తంగా ఎన్నోపాఠ‌శాలలు, కాలేజీలకు తిరుగుతూ ఎంతో మంది యువ‌త‌కు మార్గ‌ద‌ర్శ‌కం చేశారు. అబ్దుల్ క‌లాం గ్రామీణ ప్రాంతాల‌ను అభివృద్ధి చేయ‌డానికి పురా అనే ట్ర‌స్ట్ ను స్థాపించారు. త‌న‌కు వ‌చ్చే ఆదాయాన్ని అటువైపుకు పంపేవారు. క‌లాం పెళ్లి చేసుకోలేదు. బ్ర‌హ్మ‌చారి. భార్య‌. పిల్ల‌లు, కుటుంబం ఆస్తి ఇవేమీ ఆయ‌న‌కు లేవు. దేశ‌మంతా ఆయ‌న‌కు కుటుంబ‌మే అని ఫీల‌య్యే వారు.

అంతేకాదు..వైద్య‌రంగంలో పోలియో బాధితుల‌కు తేలిక‌పాటి ప‌రిక‌రాలు అందించేందుకు….. విశేష కృషి చేశారు. ఈయ‌న చేసిన సేవ‌ల‌కుగాను భార‌త ప్ర‌భుత్వం ఇత‌నికి భార‌త్ ర‌త్న‌, ప‌ద్మ‌విభూష‌న్‌, ప‌ద్మ‌భూష‌ణ్ల‌తో స‌త్క‌రించింది. 2005 మే 26వ తేదీన క‌లాం స్విట్జ‌ర్ లాండ్ దేశంలో ప‌ర్య‌టించారు. దీంతో ఆ దేశం ఏకంగా మే 26ను సైన్స్ డేగా ప్ర‌క‌టించుకుంది. క‌లాం త‌న వ‌ల్ల ఏ ప్రాణి హాని క‌ల‌గాల‌ని కోరుకునేవారు క‌దా. అంత మృధుస్వ‌భావి. ఒక‌సారి డీఆర్‌డీవో ఆఫీస్ చుట్టు క‌ట్టిన గోడ పైభాగంలో గాజుపెంకులు పెడుతుంటే…అవి ప‌క్షుల‌ను గాయ‌ప‌రుస్తాయ‌ని గాజుపెంకుల‌ను పెట్ట‌లేదు. అలాగే ఒక‌సారి షిల్లాంగ్‌లో క‌లాం ఐఏఎంలో ప్ర‌సంగం ఇచ్చేందుకు వెళ్తున్నారు. ఈయ‌న ప్ర‌యాణిస్తున్న కాన్వ‌య్‌లోని ముందు జీపులో ……లాపంగ్ అనే కానిస్టేబుల్ ఉన్నాడ‌ట‌. అది చూసిన క‌లాం ఆ కానిస్టేబుల్ ఎందుకు అలా నిలుచోపెట్టారు. కూర్చొమ‌నండి అని ప‌క్క‌నే ఉన్న పోలీసు అధికారితో చెప్పాడ‌ట‌. కానీ ఆ కానిస్టేబుల్ కూర్చొలేదు. షిల్లింగ్ వెళ్లిన త‌ర్వాత ఆ కానిస్టేబుల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌న కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డావ‌ని..బాగా అలసిపోయావు ఏమైనా తింటావా అని అడిగార‌ట‌.

దీన్ని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు ఆయ‌న‌ది ఎంత మంది మ‌న‌సు అనేది. 2015న జూలై 27న షిల్లాంగ్‌లో యువ‌త‌కు ప్ర‌సంగం ఇస్తుండ‌గా ఒక్క‌సారి కుప్ప‌కూలిపోయారు. వెంట‌నే ద‌గ్గ‌ర్లోని బెతానీ ఆస్ప‌త్రిలోచేర్చారు. కానీ ఆయ‌న‌లో చ‌ల‌నం లేదు. సాయంత్రం ఏడు 45 నిమిషాల‌కు….. ఆయ‌న గుండెపోటుతో చ‌నిపోయ‌వార‌నే వార్త దేశం మొత్తం పాకింది. ఆ వార్త విని బాధ‌ప‌డ‌ని వ్య‌క్తి అంటు ఎవ‌రూ లేరు. చివ‌రి శ్వాస వ‌ర‌కు ఆయ‌నకిష్ట‌మైన యువ‌తతో మాట్లాడే చ‌నిపోయారు. ఆయ‌న చ‌నిపోయే స‌మ‌యానికి….. త‌న‌కంటూ ఏమీ సంపాదించ‌కులేదు. చ‌నిపోయే నాటికి ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్న‌ది ఆరు చొక్కాలు, నాలుగు ఫ్యాంట్లు, 2500 పుస్త‌కాలు, ఆయ‌న‌కొచ్చిన అవార్డులు. ఇవే ఆయ‌న‌కు మిగిలిన ఆస్తులు. ఒక సైంటిస్టు, ఒక ప్రొఫెస‌ర్‌, రాష్ట్ర‌ప‌తి గా ప‌ని చేసిన వ్య‌క్తి …….త‌న‌కంటూ ఏమీ మిగుల్చుకోలేదు. కానీ మ‌నం ఆయ‌న్ను గుర్తు పెట్టుకునేలా …. కొన్ని పుస్త‌కాల‌ను రాసి వ‌దిలి వెళ్లిపోయారు.

ఆయ‌న జీవిత‌చరిత్ర గురించి తెలిపే వింగ్స్ ఆఫ్ ఫైర్‌, మైజ‌ర్నీ, యువ‌త‌కు ఇన్సిపిరేష‌న్ ఇచ్చే ఇండొమిట‌బుల్ స్పిరిట్‌, ఇగ్నేటెడ్ మైండ్స్‌, ఇండియా 2020. ట‌ర్నింగ్ పాయింట్స్ ఇలా ఎన్నో పుస్త‌కాలు కలాం గారి క‌లం నుంచి ప్రాణం పోసుకున్నాయి. సప్ర‌తీ ఒక్క‌రూ జీవితంలో చ‌ద‌వాల్సిన పుస్త‌కాలివి. స‌మ‌యం దొరికితే యువ‌త‌కు ప్ర‌సంగాలు ఇవ్వ‌డం, లేక‌పోతే త‌న‌కిష్ట‌మైన వీణ‌ను వాయించ‌డం, లేదంటే పుస్త‌కాల‌ను చ‌దివిందుకే స‌మ‌యానికి కేటాయించేవారు. ఆయ‌న లాంటి వ‌క్త‌ను, నాయ‌కుడిని , రాష్ట్ర‌పతిని, శాస్త్ర‌వేత్త‌ను, దేశ‌భ‌క్తుడ్ని మ‌నం చూడ‌లేము. ఇక మీద‌ట చూడ‌బోము కూడా.ఆయ‌న భౌతికంగా మ‌న ద‌గ్గ‌ర లేక‌పోవ‌చ్చు కానీ చిన్న‌పిల్ల‌ల న‌వ్వుల్లో, యువ‌త క‌ల‌ల్లోక‌ల‌క‌లాం క‌లాం మ‌న‌తో నే ఉండిపోతారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad