Home టాప్ స్టోరీస్ బీర్ పేరు చెప్తేనే భయపడుతున్న మందు బాబులు !

బీర్ పేరు చెప్తేనే భయపడుతున్న మందు బాబులు !

కరోనావైరస్ కారణంగా ప్రపంచ దేశాలు గడగడా వణికి పోతున్నాయి. ఈ వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనని ప్రజలు తమ జీవన విధానంలో అనేక మార్పులు చేసుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా మాస్కులు ధరించడం, తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు వినియోగించడంతో ప్రజల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఈ మార్పులు కేవలం నిత్యవసర విధానంలో మాత్రమే కాదు…ఆహార అలవాట్లలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కరోనా వైరస్ మందు బాబుల్లో కూడా విపరీతమైన మార్పులకు కారణం అయ్యింది. మద్యం షాపుల్లో మందుబాబులు బీరు తీసుకోవడానికి హడలెత్తి పోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బీరు వినియోగం భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు సీజన్ ఏదైనా బీర్లు ఉప్పెనలో పొంగేవి. చిల్డ్ బీరు తాగితే వచ్చే ఆనందం వేరేఅని మందు బాబులు మందు మీద ప్రమాణం చేసి మరీ చెప్పేవారు. అయితే ఇప్పుడు అదే బీర్ ప్రేమికులు ఆ పేరు చెప్తేనే భయపడి చూస్తున్నారు. బీర్ కు బదులుగా విస్కీకి తీసుకోవడానికి మందు బాబులు అంటున్నారు. దీనితో బీర్ కి డిమాండ్ తగ్గింది.

దీనికి కారణం కరోనా మహమ్మారి.చిల్డ్ బీరు తాగితే ఎక్కడ జలుబు చేసి కరోనా సోకుతుంది ఏమోనని తెగ భయపడుతున్నార. సోషల్ మీడియాలో బీరు తాగితే కరోనా వస్తుందని అసత్య వార్తలు నమ్మి మరికొందరు బీరు కు బైబై చెప్పేశారు. అయితే బీరును వదిలేశారు కానీ మద్యాన్ని కాదు. అందుకే మద్యం ప్రియులు విస్కీ చేతబట్టి రాష్ట్ర ఖజానా నింపే పనిలో నిమగ్నమై ఉన్నారు. విస్కీ కాస్త వెచ్చగా ఉంటుంది, సో జలుబు వచ్చే ప్రమాదం లేదన్నది వారి అభిప్రాయం.


ఈ కారణంగానే నగరంలో బీరు విక్రయాలు గణనీయంగా తగ్గాయని వైన్ షాప్ ఓనర్లు తెలిపారు. గత 45 రోజుల నుండి హైదరాబాదులో ఇదే ట్రెండ్ కొనసాగితే వస్తుంది. బీరు విక్రయాలు తగ్గడంతో మద్యం షాపు ఓనర్ లు కూడా బీర్ స్టాక్ తగ్గించేశారు. ఎక్కువమంది బ్లెండర్స్ ప్రైడ్ ని కొంటున్నారు. ఆ తర్వాత మెక్ డొవెల్స్ సిగ్నేచర్, రాయల్ చాలెంజ్, రాయల్ స్టాగ్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని వైన్ షాపుల ఓనర్లు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ సీజన్ తో సంబంధం లేకుండా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నది వాస్తవం.

- Advertisement -

Popular Stories

రాంచ‌ర‌ణ్ న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంది అంద‌రూ అనుకునే వ్య‌క్తి నుంచి కాదు తెలుసా….”

సినిమాల్లో వార‌స‌త్వం చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తుంటారు. ముందు తండ్రులు ఆ త‌ర్వాత వారి కుమారులు, కుమార్తెలు వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తుంటారు. స‌క్సెస్ అయితే వాళ్ల...

వర్మ పవర్ స్టార్..రికార్డుల్లో సూపర్ స్టార్ !

రామ్ గోపాల్ వర్మ ఈ పేరు గురించి ప్రత్యేకమైన ఇంట్రోలు, స్పెషల్ ఎఫెక్ట్ లు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే వర్మ అంటే వివాదం,...

మగ‌ధీర‌కు 11 ఏళ్లు…ఇన్నేళ్ల‌లో రాజ‌మౌళి, రాంచ‌ర‌ణ్ ఏం సాధించారు

మ‌గ‌ధీర తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోనే ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీ. జూలై 31వ తేదీకి ఆ సినిమా రిలీజై 11 ఏళ్లు...

సినిమాల్లో ప‌డి పిల్ల‌ల‌ను క‌న‌లేక‌పోయిన తార‌లు

ఏ స‌మ‌యంలో చేయాల్సింది ఆ స‌మ‌యంలోనే చేయాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అందుకే ఈడు రాగానే అమ్మాయిలకైనా అబ్బాయిల‌కైనా పెళ్లిళ్లు చేస్తుంటారు. అలా చేయ‌డం...

ఇగో లేని మ‌నిషి.. ప‌వ‌న్ క‌ల్యాణ్

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో వ‌చ్చిన  మొద‌టి సినిమా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. 2018 అక్టోబ‌ర్ లో రిలీజైన ఈ  సినిమా...
- Advertisement -

Related News

పెళ్ళైన రెండో రోజే ఆత్మహత్య!

కాళ్ల పారాణి ఆర‌లేదు. క‌ట్టిన తోరణాలు ఎండ‌లేదు. ఇంత‌లోనే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న క‌న్న బిడ్డ తిరిగిరాని లోకాల‌కు...

బ్రాండెడ్ కంపెనీలు వెల‌వెల‌…డిస్కౌంట్, ఆఫ‌ర్ బోర్డుల వెల్క‌మ్

బ్రాండెడ్ దుస్తుల కోసం చాలా మంది పోటీప‌డుతారు. బ్రాండ్ కంపెనీని బ‌ట్టి కొనేస్తుంటారు. ఎంత రేటు ఉన్నా స‌రే త‌మ‌కు న‌చ్చిన బ్రాండ్...

చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన 17 ఏళ్ల కుర్రాడు

భారత్ తో కయ్యానికి కాలు దువ్విన చైనా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంటా,బయట తగలుతున్న షాక్ లుతో కోలుకునే అవకాశం కూడా...
- Advertisement -