Home టాప్ స్టోరీస్ ఒక గుడి… 20 వేల ఎలుకలు… ఎందుకో తెలుసా?

ఒక గుడి… 20 వేల ఎలుకలు… ఎందుకో తెలుసా?

PicsArt 08 13 01.12.58

మనకు ఎలుకల్ని చూడగానే గణనాథుడే గుర్తుకువస్తాడు. ఎందుకంటే, మూషికం ఆయన వాహనమే కాబట్టి! కానీ, రాజస్థాన్ వాసులకి, ముఖ్యంగా, బికనేర్ ప్రాంతంలోని రాజ్ పుత్లకి… కర్ణిమాత మనసులో మెదులుతుంది! ఇంతకీ ఈ కర్ణి మాత ఎవరు?ఆమెకి ఎలుకలకి ఏంటి ఆ అలౌకికమైన సంబంధం?


రాజస్థాన్ లోని బికనేర్ నగరానికి 30కిలో మీటర్ల దూరంలో వుంటుంది దేశ్ నోక్ గ్రామం. అక్కడే వుంటుంది ఎలుకల గుడి! అవును… అది నిజానికి దుర్గాదేవీ అవతారమైన కర్ణి మాతా ఆలయమైనప్పటికీ… అక్కడ వుండే ప్రత్యేకమైన మహిమాన్వితమైన ఎలుకల కారణంగా మూషికాల గుడిగా ప్రఖ్యాతమైంది. అక్కడ ఒకటి రెండు కాదు… ఏకంగా ఇరవై వేలకు పైచిలుకు ఎలుకలుంటాయి! ఆలయం మొత్తం స్వేచ్ఛగా తిరిగేస్తుంటాయి.

images 19

భక్తులు కూడా భయం లేకుండా… భక్తిపారవశ్యంతో వాటికి… తియ్యటి ప్రత్యేక ప్రసాదాలు నివేదిస్తుంటారు. ఆ ఎలుకలు కొరికి వదిలిన ప్రసాదాల్ని కళ్లకద్దుకుని మరీ స్వీకరిస్తారు! ఇంతకీ… ఈ విశేషమైన ఆచారానికి, విశ్వాసానికి కారణం ఏంటి? కర్ణి మాత మహిమే! కర్ణి మాత 15వ శతాబ్దంలో రాజస్థాన్ లో జీవించిన ఒక యదార్థ అవతార మూర్తి. ఆమెను స్థానికులు దుర్గా దేవీ అంశగా భావించేవారు. మొదట్లో ఆమె మామూలు రాజ్ పుత్ వనితగానే జీవించినా… పెళ్లైన తరువాత ఆమె మహిమలు అంతకంతకూ బయటపడ్డాయి.

PicsArt 08 13 01.13.28

దాంతో కర్ణి మాత భర్తి ఊరి వారు కొందరు ఆమెకు భక్తులయ్యారు. ఆమె కూడా తనకు సంసార జీవితం మీద ఆసక్తి, అభిలాష లేవని చెప్పి ఇంట్లోంచి బయలుదేరి వెళ్లిపోయింది. అయితే, అంతకంటే ముందే కర్ణి మాత తన చెల్లెల్ని ఇచ్చి భర్తతో వివాహం జరిపించింది. అలా భర్తని చెల్లెలి చేతిలో పెట్టి తాను ఊరూరూ తిరుగుతూ సంచార జీవితం గడిపింది. ఆమె వెంట కొందరు భక్తులు, కొన్ని పశువుల్ని తీసుకుని వెళ్లారు. వారి ప్రయాణం చివరకు దేశ్ నోక్ అనే గ్రామంలో ముగిసింది.

అక్కడే కర్ణిమాత స్థిరపడ్డారు. అయితే, ఒక రోజు 151 సంవత్సరాల ఆమె హఠాత్తుగా అదృశ్యం అవ్వటంతో … అందరూ విపరీతంగా వెదికారు. చివరకు దుర్గా దేవి అంశ అయిన ఆమె అవతారం పరిసమాప్తి చేసిందనే నిర్ణయానికి వచ్చి గుడి కట్టారు! అదే నేడు…దేశ్ నోక్ లోని ఎలుకల ఆలయం అయింది! ఇంతకీ… కర్ణి మాతకి, ఎలుకలకి ఏంటి సంబంధం అంటారా? కర్ణి మాత ఒకసారి తన చెల్లెలు కొడుకు లక్ష్మణ్ ఓ సరస్సులో పడి చనిపోతే యముడితోనే పోరాడిందట.

PicsArt 08 13 01.12.42

మొదట యముడు లక్ష్మణ్ ను తిరిగి పంపటానికి ఒప్పుకోకున్నా… చివరకు ఎలుక రూపంలో భూమ్మీదకి పంపాడట. తరువాత కర్ణి మాత వంశంలోని మిగతా వారంతా కూడా ఎలుకలైపోయారట. వారే ఇప్పుడు మనకు కర్ణి మాతా ఆలయంలో కనిపించే వేలాది ఎలుకలు!రాజస్థాన్ లో వున్న ఈ టెంపుల్ ఆఫ్ ర్యాట్స్ ను చూడటానికి దేశ, విదేశీ టూరిస్టులు వేలాది మంది వస్తుంటారు. మరీ ముఖ్యంగా, వేలాది నల్ల ఎలుకల మధ్య వుండే అతి కొద్ది తెల్ల ఎలుకలు మహా మహిమాన్వితం అని నమ్ముతారు భక్తులు. వాటికి గంటల తరబడి ఎదురు చూసి దర్శనం చేసుకుని తరిస్తుంటారు! తెల్ల ఎలుకలు కంటపడితే ఎలాంటి వారికైనా సంతానం కలుగుతుందని ప్రతీతి!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad