Home టాప్ స్టోరీస్ ఒక్క రోజే 266 కరోనా మరణాలు : కరోనా కరాళ నృత్యం

ఒక్క రోజే 266 కరోనా మరణాలు : కరోనా కరాళ నృత్యం

Carona Deaths

భారత్ లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంది. గడిచిన నాలుగు రోజుల్లో ప్రతి రోజు దాదాపు 50 వేలకు పాజిటివ్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. దీనితో ఒక్క రోజులేనే 8 లక్షల మార్కును దాటేశాయి. దీనితో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 18,03,696లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 5,79,537 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో సోమవారం ఒక్క రోజే 8,968 కొత్త కేసులు నమోదు కగా, ఏకంగా 266 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,50,196కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వీరిలో ఇప్పటి వరకు 2,87,030 మంది కోలుకోగా, 15,842 మంది మరణించారు. ప్రస్తుతం 1,47,018 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక, పుణే నగరంలో అత్యధికంగా 41,644 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్రలు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు, ముఖ్యంగా ముంబై నగర విధులు స్మశాన వాటికలు వాలే కనిపిస్తున్నాయి. భారత చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క రోజులో 266 మంది చనిపోవడం ఇదే మొదటిసారి. మరో వైపు తమిళనాడులో రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 5,609 కేసులు నమోదయ్యాయి. 109 మంది మృత్యువాత పడ్డారు.కరోనా సృష్టిస్తున్న ప్రళయ భీకరాన్ని చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో భారీగా మరణం సంభవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad