Home టాప్ స్టోరీస్ బంగారం ధ‌ర‌లు చుక్క‌నంటుతున్నాయి

బంగారం ధ‌ర‌లు చుక్క‌నంటుతున్నాయి

gold price

ప‌సిడి ధ‌ర‌లు చుక్క‌నంటుతున్నారు బంగార ధ‌ర‌లు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ‌త కొన్నాళ్లుగా పెరుగుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌లు ఇవాళ కూడా పెరిగింది. ద‌గ‌ద‌గ‌మంటూ దూసుకెళ్లింది. బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ లో బంగారం ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలోనే దేశీయ మార్కెట్ లోనూ ప‌సిడి ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని బులియ‌న్ మార్కెట్ నిపుణులు అభిప్రాయప‌డుతున్నారు. ఇవాళ బంగారం ధ‌ర విష‌యానికొస్తే …..గురువారం హైద‌రాబాద్ బంగారం ధ‌ర‌లు పెరిగాయి. ప‌ది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర 200 రూపాయ‌లు పెరిగింది. దీంతో ధ‌ర 200 పెరిగింది. దీంతో ధ‌ర 57 వేల ప‌ది రూపాయ‌ల‌కు చేరింది. ఇది ఆల్ టైమ్ గ‌రిష్ట స్థాయి పెరుగుద‌ల గా చెప్పుకోవ‌చ్చు.

అదే స‌మ‌యంలో 22 క్యారెట్ల బంగారం ధ‌ర కూడా పెరిగింది. ప‌ది గ్రాముల బంగారం ధ‌ర 200 రూపాయ‌ల పెరుగుద‌ల‌తో ….52 వేల 280 రూపాయ‌ల‌కు పెరిగింది. ప‌సిడి ధ‌ర పెరిగితే వెండి ధ‌ర కూడా అదే దారిలో న‌డిచింది. కేజీ వెండి ధ‌ర 150 రూపాయ‌లు పెరిగింది. దీంతో ధ‌ర 65 వేల 200 రూపాయ‌ల‌కు చేరింది. ప‌రిశ్ర‌మ యూనిట్లు, నాణెపు త‌యారీదారుల నుంచి డిమాండ్ మంద‌గించడం ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. దేశ‌రాజ‌ధాని ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధ‌ర పెరిగింది. 22 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధ‌ర 200 రూపాయ‌లు పైకి క‌దిలింది. దీంతో ధ‌ర 52 వేల 750 రూపాయ‌ల‌కు చేరింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం కూడా ఇదే దారిలో ప‌య‌నించింది. 200 రూపాయ‌ల పెరుగుద‌ల‌తో ….53 వేల 950 రూపాయ‌ల‌కు ఎగ‌సింది. ఇక కేజీ వెండి ధ‌ర 250 రూపాయ‌ల పెరుగుద‌ల‌తో ధ‌ర 65 వేల 300 రూపాయ‌ల‌కు చేరింది.

ఇక అంత‌ర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధ‌ర పెరిగింది. ప‌సిడి ధ‌ర ఔన్స్‌కు 0.80 శాతం పైకి క‌దిలింది. దీంతో బంగారం ధ‌ర ఔన్స్‌కు 2023 డాల‌ర్ల‌కు చేరింది. బంగారం ధ‌ర పెరిగితే వెండి ధ‌ర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధ‌ర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుద‌ల‌తో 26.05 డాల‌ర్ల‌కు ఎగ‌సింది. ఇక పోతే ద్ర‌వ్యోల్బ‌ణం, గ్లోబ‌ల్ ప‌సిడి ధ‌ర‌ల్లో మార్పు, జ్యువెల‌రీ మార్కెట్లు, బౌగోళిక ఉద్రిక్త‌లు, కేంద్ర బ్యాంకుల వ‌ద్ద ఉన్న బంగారం నిల్వ‌లు ….ప‌సిడి ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad