Home టాప్ స్టోరీస్ గుంటూరు పోలీసుల పై సీబీఐ కేసు : చట్టం ముందు అందరూ ఒకటే

గుంటూరు పోలీసుల పై సీబీఐ కేసు : చట్టం ముందు అందరూ ఒకటే

PicsArt 08 12 04.12.09

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో గుంటూరు అర్బన్ పోలీసులుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముగ్గురు వ్యక్తులును అక్రమంగా నిర్బంధించారు అనే అభియోగంపై సీబీఐ ఈ కేసు ఫైల్ చేసింది. 2019 అక్టోబరులో గుంటూరు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే తమ భర్తను అక్రమంగా నిర్బంధించారని నల్లబోలు సునీత, రాయిది నాగలక్ష్మి, తుమ్మటి విజయలక్ష్మిలు పోలీసులపై కేసు పెట్టారు. దీనితో పాటు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై పోలీసులు కూడా కౌంటర్ ఫైల్ వేశారు. అయితే పోలీసుల కౌంటర్ పిటిషన్ పై అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు గుంటూరు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసుల‌పై కేసు నమోదు చేసి విచారించి వలసిందిగా ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ గుంటూరు పీఎస్‌ ‌ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.వెంకటరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ సాంబశివరావు కానిస్టేబుల్‌ వీరాంజనేయులుతో పాటు ఆ స్టేషన్ కు చెందిన మరికొంతమంది వ్యక్తులపై ఐపీసీ 120 బీ, 344, 348 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. ఈ కేసులో సదరు మహిళలు ఆరోపిస్తున్నట్లు పోలీసులు నిజంగానే భర్తలను నిర్బంధించినట్లు నిర్దారణ అయితే వారిపై కఠిన చర్యలు ఉండటంతో పాటు కౌంటర్ ఫైల్ ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు తీవ్రమైన చర్యలు ఉండే అవకాశం ఉంది.ఈ కేసులో ప్రధాన కారకుడు సీఐ కళ్యాణ రాజుపై కూడా కేసు నమోదు చేయాలని న్యాయవాది మాగులూరి హరిబాబు డిమాండ్ చేశారు. ప్రస్తుత ఈ కేసును సీబీఐ టేకాఫ్ చేయడంతో అందిరికి ఆసక్తి నెలకొంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad