Home టాప్ స్టోరీస్ బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

Bruce Lee

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు. అలాంటి వ్య‌క్తులు ఉన్నా లేక‌పోయినా త‌ర‌త‌రాలు వాళ్ల గురించి చెప్పుకుంటాయి. ఇందుకు వాళ్లు సాధించిన ఘ‌న‌తే కార‌ణం. అలాంటి వారిలో ఒక‌డు మార్ష‌ల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్ లీ. ఎత్తు 5 అడుగుల ఆరు అంగుళాలు. బ‌రువు 58 కేజీల బ‌రువు. ఉక్కులాంటి కండ‌రాలు, కంటికి క‌నిపించిన మెరుపు వేగం ఇత‌ని సొంతం. ఎదుట‌వాడు ఎంత‌టి వాడైనా స‌రే ఒక్క దెబ్బ‌తో మ‌ట్టి క‌రిపించ‌గ‌ల స‌త్తా ఉన్నోడు.  కుంగ్‌ఫూ , క‌రాటీ లాంటి పోరాట విద్య‌లు నేర్చు‌కునే వాళ్ల‌కు ఇత‌నో ఆరాధ్య‌దైవం. అస‌లు బ్రూస్ లీపోరాట యోధుడి కావ‌డానికి కార‌ణ‌మేంటి….ఆ రోజుల్లో అత‌ని ఓడించగ‌లిగే వాడు లేడంటే అత‌ని శ‌క్తి ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు.

మ‌రి అలాంటి శ‌క్తివంతుడు 32 ఏళ్ల‌కే ఎలా చ‌నిపోయాడు. అస‌లు ఓ సామాన్య మైన కుర్ర‌వాడు…ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీరంగంలో ఒక య‌క్ష‌న్ హీరోగా, క‌రాటే యోధుడిగా ఎలా మారాడు…అనేది చాలా మందికి తెలియ‌దు. అందుకే అత‌ను జీవిత‌చరిత్ర‌, సినీరంగంలో ఆయ‌న సాధించిన విజయాలు గురించి మేము మీకు అందిస్తున్నాం. 1940 న‌వంబ‌ర్ 27వ తేదీన అమెరికాలోని  శాన్‌ప్రాన్సిస్కో న‌గ‌రంలో బ్రూస్ లీ పుట్టాడు . కొంత‌కాలం త‌ర్వాత అమెరికా నుంచి హాంకాంగ్ వెళ్లిపోయింది బ్రూస్ లీ కుటుంబం. బ్రూస్ లీ తండ్రి సినిమాల్లో న‌టించేవారు. బ్రూస్ లీని కూడా అప్పుడ‌ప్పుడు షూటింగులుకు తీసుకెళ్లేవాడు. దీంతో చిన్న‌ప్పుడే అతనుకు న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.

అలా న‌ట‌న‌తో పాటు బ్రూస్ లీ డ్యాన్స్ కూడా నేర్చ‌కున్నారు. అప్ప‌ట్లో హాంకాంగ్‌లో మాఫీయా ముఠాలు , గ్యాంగులు పాలించేవి. అక్క‌డ బ‌త‌క‌డం చాలా క‌ష్టం.  అప్ప‌ట్లో బ్రూస్ లీకి 14 ఏళ్లు. ఒక‌సారి స్కూల్ నుంచి ఇంటికి వ‌స్తుండ‌గా …..ఒక గ్యాంగ్ బ్రూస్ లీని కొట్టింది.  ఆ ఘ‌ట‌నే బ్రూస్‌లీ ని మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకునేలా చేసింది. త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డం కోసం బ్రూస్ లీ మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవాల‌ని అనుకున్నాడు. అప్ప‌ట్లో  కుంగ్‌ఫూలో నంబ‌ర్ వ‌న్ గా ఉన్న  హిప్‌మ్యాప్ అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర……. బ్రూస్ లీ కుంగ్‌ఫూ నేర్చ‌కున్నాడు. ఒక‌సారి స్కూల్‌లో ఆ గ్యాంగ్ మ‌రోసారి బ్రూస్ లీపై దాడికి దిగారు. అయితే ఈ సారి బ్రూస్‌లీ మ‌నుప‌టిలా కాదు. ఈ సారి గ్యాంగ్ లో  ఒక‌డికి ప‌ళ్లు ప‌గ‌ల‌కొట్టాడు. మ‌రొక‌రికి చేయ్యి విర‌గ్గొట్టాడు.

దీంతో ఈ సారి బ్రూస్ లీ గొడవ‌కు దిగితే…… జైల్లో పెడ‌తామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. దీంతో మాఫియా గ్యాంగ్‌ల‌కు దూరంగా ఉంచ‌డం కోసం  బ్రూస్ లీ త‌‌ల్లిదండ్రులు……..అత‌న్ని 18 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు  కాలిఫోర్నియాలోని త‌న స్నేహితుడి ఇంటికి పంపారు. దీంతో  పుట్టిన దేశానికి వ‌చ్చేశాడు బ్రూస్ లీ. మొద‌ట ఒక రెస్టారెంట్‌లో వెయిట‌ర్‌గా ప‌నిచేశాడు. ఆ త‌ర్వాత యూనివ‌ర్శిటీ ఆఫ్ వాషింగ్ట‌న్‌లో పిలాస‌ఫీలో జాయిన్ అయ్యాడు. అక్క‌డ చ‌దువుతూనే …..మార్ష‌ల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు  . ఆ మార్ష‌ల్ ఆర్ట్స్ వ‌ల్ల కాలేజీలో బ్రూస్‌లీ క్రేజ్ పెరిగిపోయింది. ఎంతో్ మంది స్నేహితులు బ్రూస్ లీ వ‌ద్ద క‌రాటే నేర్చుకునేందుకు ఆస‌క్తి చూపెట్ట‌వాడు.

అలా స్నేహితులు కోరిక మేర‌కు చదువ‌కుంటూనే 1963లో జెన్‌ఫ్యాన్‌గుంగ్ ఫూ అని ఇన్‌స్టూట్యూట్‌ను స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత  త‌న కాలేజీ స్నేహితురాలు  లిండా ఎమిరీస్‌ని ప్రేమించి…. 1964లో  పెళ్లి చేసుకున్నాడు.  కొన్ని రోజు‌ల్లోనే అమెరికాలో త‌న రెండో ఇన్‌స్ట్యూట్ ను కూడా స్టార్ట్ చేశాడు. అయితే బ్రూస్ లీ ఎదుగుద‌ల‌ను త‌ట్టుకోలేక‌పోయిన కొంద‌రు ఆసియ‌న్ మార్ష‌ల్‌ఆర్ట్స్ మాస్ట‌ర్స్ …..బ్రూస్‌లీకి అడ్డుత‌గిలేవారు.  చంపేస్తామ‌ని బెదిరించారు. అయినా స‌రే బ్రూస్ లీ బెద‌ర‌లేదు.బ్రూస్ లీ త‌న‌కు తెలిసిన క‌రాటే కుంగ్‌ఫూ, బాక్సింగ్ అన్ని క‌లిపి …..జీత్ కుండూఅనే కొత్త ర‌కం మార్ష‌ల్  ఆర్ట్స్‌ను క‌నిపెట్టాడు. ఒక‌సారి ఎట్ పార్క‌ర్ ఛాంపియ‌న్ షిప్ పోటీల్లో బ్రూస్ లీ ఇచ్చిన వ‌న్ ఇంచ్ ‌పంచ్….. అప్ప‌ట్లో సంచ‌ల‌నం.

అంతేకాదు…అతి క‌ష్ట‌మైన డ్రాగ‌న్‌ఫ్లాగ్ అనే మార్ష‌ల్ ఆర్ట్స్ ఆస‌నాన్ని అర‌గంట‌పాటు వేసేవాడు.బ్రూస్ లీ ఒక్క అంగుళం నుంచి పంచ్ ఇస్తే….. ఒక మ‌నిషి ఐదు నుంచి ఆరు మీట‌ర్ల దూరంలో ప‌డేవాడు. అంతేకాదు…చాప్ స్టిక్స్‌తో గాలిలో వేసిన బియ్య‌పు గింజ‌ల‌ను కూడా ప‌ట్టుకునేవారు. మీ చేతితో ఒక  కాయిన్ ఉంచుకుని మీ చేతిని మూసేలోపు …..మీ చేతి నుంచి ఆ కాయిన్‌ను తీసివేయ‌గ‌ల‌డు. ఇలా ఒక‌టా రెండా ……ఒక మ‌నిషి చేయ‌లేడు అనుకోని ఎన్నింటిని బ్రూస్ లీ చేసి చూపించాడు. ఇక  1965లో బ్రూస్‌లీకి కొడుకు పుట్టాడు. అత‌ని పేరు బ్రాండెన్ బ్రూస్ లీ. అయితే బాబు పుట్టిన ఆనందం ఒక్క వారం మించి ఉండ‌లేదు. వారం రోజుల్లోపే బ్రూస్ లీ తండ్రి  చ‌నిపో్యాడు. కొంత‌కాలం త‌ర్వాత బ్రూస్ లీకి ది గ్రీన్ హార్నెట్లాం , బ్యాట్‌మ్యాన్ లాంటి టి షోలో ……న‌టించే అవ‌కాశం ఉంది.

ఆ షోల త‌ర్వాత చాలా మంది హీరోల‌కు మార్ష‌ల్ ఆర్ట్స్ కోచ్‌గా జాయిన్ అయ్యాడు. 1970లో ఒక‌సారి వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండ‌గా…. బ్రూస్ లీ వెన్నుపాము ఒక‌సారి దెబ్బ‌తినింది. దీంతో డాక్ట‌ర్లు బ్రూస్ లీని….మ‌ళ్లీ మార్ష‌ల్ ఆర్ట్స్ చేయ‌లేడ‌ని నిర్దారించారు. వాళ్లు చెప్పింది త‌ప్పు అని నిరూపించేలా…. మ‌ళ్లీ కొన్ని రోజుల‌కు మార్ష‌ల్ ఆర్ట్స్‌లోకి వ‌చ్చాడు. బ్రూస్ లీ ఒక్క రోజుకు 2 వేల పంచులు,  వెయ్యి కిక్కులు, ఐదు కిలోమీట‌ర్ల ప‌రుగు….ఇలా రోజూ విప‌రీతంగా ప్రాక్టీస్ చేసేవాడు. అంతేకాదు…కొడుకుకు కూడా చిన్న‌ప్ప‌టి నుంచి మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్పేవాడు. కొంత‌కాలానికి బ్రూస్‌లీకి కూతురు కూడా పుట్టింది. ఆ త‌ర్వాత బ్రూస్ లీ హాంకాంగ్‌కు వెళ్లిపోయాడు. అక్క‌డ రేమండ్ చావ్ అనే ఒక నిర్మాత‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

అత‌నితో క‌లిసి బ్రూస్ లీ తీసిన ది బిగ్ బాస్ అనే సినిమా సంచ‌ల‌నంగా నిలిచింది. ఆసియాలోనే అన్ని బాక్సాఫీస్ సినిమాల రికార్డుల‌ను  బ‌ద్ధ‌లుకొట్టింది. బ్రూస్ లీ సినిమాలు చేసే ఫైట్లు ….కెమెరాలో క‌నిపించ‌నంత వేగంగా ఉండేవ‌ట‌. అందుకే  ఆఫైట్ల‌ను స్లోమోష‌న్‌లో చూపెట్టేవాళ్లు. అంటే  బ్రూస్ లీ స్పీడ్ ఎలాంటిది అర్ధం చేసుకోవ‌చ్చు. ది బిగ్ బాస్ హిట్‌తో బ్రూస్ లీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. అయితే త‌న‌కొచ్చిన క్రేజ్‌తో స‌రిపెట్టుకోలేదు బ్రూస్‌లీ. మ‌రింత క‌ష్ట‌ప‌డ్డాడు. త‌ర్వాత తీసిన ఫిస్ట్ ఆఫ్ ప్యూరీ అనే సినిమాలో….. మొట్ట‌మొద‌టిసారిగా అంత‌కు ముందు ఏ సినిమాలో చూడ‌ని నాన్ చాక్ అనే కొత్త వెప‌న్‌ను ప‌రిచ‌యం చేశాడు.

నాన్ చాక్ విద్య‌ను ఇప్ప‌టికీ నేర్చుకుంటున్నారంటే ఆ క్రెడిట్ బ్రూస్‌లీకి ద‌క్కుతుందేమో. ఫిస్ట్ ఆఫ్ ప్యూరీ సినిమాతో  పాత బాక్సీఫీస్ రికార్డుల‌న్నీ బ‌ద్ధ‌లు చేశాడు. ప్ర‌పంచంలోనే కొత్త యాక్ష‌న్ స్టార్ హీరోగా మారాడు. ఆయ‌న తీసిన వే ఆఫ్ ది డ్రాగ‌న్ అనే సినిమాకు అంతా ఆయ‌నే. అన్నివిభాగాల‌కు బ్రూస్ లీ పెద్ద‌గా చేశాడు. ఈ సినిమా కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ తో క‌లిసి ఎంట‌ర్ ది డ్రాగ‌న్ అనే సినిమా తీశాడు. ఇది రిలీజ్ అవ్వ‌డానికి కొద్ది రోజులు ముందు బ్రూస్ లీ చ‌నిపోయాడు. త‌న త‌ర్వాత సినిమా గేమ్ ఆఫ్ డెత్ అనే సినిమా గురించి ఒక హీరోయిన్‌తో చ‌ర్చించేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు.  సినిమా గురించి చ‌ర్చిస్తుండ‌గా బ్రూస్ లీకి  త‌ల‌నొప్పి వ‌చ్చింది.

దీంతో హీరోయిన్ అక్వాజేసిక్ అనే టాబ్లెట్ ఇచ్చింది.అది వేసుకుని రూమ్‌లోకి వెళ్లి నిద్ర‌పోయాడు. అంతే…అలా నిద్ర‌పోయిన బ్రూస్ లీ ఇక లేవ‌లేదు. ఎంత‌కీ లేక‌పోవ‌డంతో హాంకాంగ్లోని  బాప్టిస్టు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ లాభం లేదు. 1973, జూలై 20వ తేదీన….. త‌న‌కు 32 ఏళ్ల వ‌య‌సులో బ్రూస్ లీ క‌న్నుమూశాడు.  ఆ వార్త‌ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. త‌న కెరీర్‌లోనే చాలా పెద్ద  సినిమా అయినా ఎంట‌ర్ ది డ్రాగ‌న్ సినిమా రిలీజ్ అవ్వ‌డానికి …..స‌రిగ్గా ఒక వారం ముందు ఆయ‌న చ‌నిపోయాడు. బ్రూస్ లీ చ‌నిపోవాడానికి కార‌ణం సెరిబ్రెయ‌ల్ ఎడిమా . అంటే  వైద్య ప‌రిభాష‌లో త‌ల‌నొప్పి వ‌ల్ల  ఆక్వాజేసిక్ అనే టాబ్లెట్ వేసుకోవ‌డంతో మెద‌డులోకి నీరుచేరి ఉబ్చి చ‌నిపోయాడ‌ని డాక్ట‌ర్లు తేల్చారు.

అయితే బ్రూస్ లీ మ‌ర‌ణం వెనుక ఎన్నో అన‌మానాలు ఇంకా ఉన్నాయి. బ్రూస్ లీ మీద కోపంతో ఉన్న హాంకాంగ్ గ్యాంగులు కానీ, చైనా మార్ష‌ల్ ఆర్ట్స్ ను ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేశాడ‌ని కోపంతో కొంత‌మంది ఆసియ‌న్ మార్ష‌ల్ ఆర్ట్స్ మాస్ట‌ర్స్ గానీ , చాలా త‌క్కువ స‌మ‌యంలోనే విప‌రీత‌మైన పేరు తెచ్చుకున్నాడ‌నే ఆసూయ‌తో ………సినీప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రు మాఫియాతో చేతులు క‌లిపి బ్రూస్ లీని చంపించి ఉంటార‌ని ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కానీబ్రూస్ లీమ‌ర‌ణానికి సెరిబ్రెయ‌ల్ ఎడిమా అని సైంటిఫిక్ మెడిసిన్‌లో  తేలింది.

బ్రూస్ లీ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్న స‌మ‌యం..హాంకాంగ్ రోడ్ల‌న్నీ జ‌నాల‌తో నిండిపోయాయి. కొన్ని వేల మంది ఆయ‌న అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. బ్రూస్ లీ కేవ‌లం ఫైట‌ర్ మాత్ర‌మే కాదు గొప్ప ఫిలాస‌ఫ‌ర్ కూడా. తూర్పు, ప‌శ్చిమ దేశాల మ‌ధ్య సంస్కృతి సంప్ర‌దాయాల‌ను క‌లిపిన మొద‌ట హీరో అత‌ను. అత‌న‌కున్న ఫ్యాష‌న్, టాలెంటే….లీని  గ్రేట్ యాక్ష‌న్ ఫిల్మ్ స్టార్‌గా మార్చింది. బ్రూస్ లీ చ‌నిపోయి ఇన్ని సంవ‌త్స‌రాలు గ‌డిచినా మ‌ళ్లీ అలాంటి న‌టుడు, యాక్ష‌ర్ ఇంకా రాలేదు. బ్రూస్ లీ మ‌ర‌ణం ఒక మిస్ట‌రీ కావ‌చ్చు. కానీ ఆయ‌న జీవితం  మాత్రం ఎప్ప‌టికి చెర‌గ‌ని  హిస్ట‌రీ. అందుకే టైమ్స్ మ్యాగ‌జైన్ బ్రూస్ లీని 20 వ శ‌తాబ్దంలో అత్యంత శ‌క్తివంత మైన వ్య‌క్తిగా కితాబిచ్చింది. బ్రూస్ లీ ఇన్సిపిరేష‌న్‌గా ఎంతోమంది కుంగ్‌ఫూ, క‌రాటే  నేర్చుకున్నారు. ఇప్ప‌టికీ కూడా నేర్చుకుంటున్నారు.  అత‌ను చ‌నిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆయ‌న చేసిన ఫైట్లు, చెప్పిన ఫిలాసిఫి, నేర్పిన విద్య‌ను  …….ఇప్ప‌టికి లోకం గుర్తు పెట్టుకుంది.  చిన్న‌వ‌య‌సులోనే ప్ర‌పంచంలో  చెర‌గ‌ని ముద్ర వేసుకున్న బ్రూస్ లీ జీవితం నిజంగా యువ‌త అంద‌రికీ ఆద‌ర్శం.

- Advertisement -

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

Disha Pathani Beautiful Pics

- Advertisement -Dummy Ad