Home టాప్ స్టోరీస్ పెళ్లి కాకుండానే త‌ల్లులైన సెల‌బ్రెటీలు

పెళ్లి కాకుండానే త‌ల్లులైన సెల‌బ్రెటీలు

PicsArt 08 05 01.12.37

పెళ్లైన త‌ర్వాత పిల్ల‌ల‌ను కన‌డం స‌హ‌జంగా ఎక్కువుగా జ‌రుగుతుంది. కానీ కాల‌క్ర‌మేణ పాశ్చాత్య సంస్కృతీ మ‌న భార‌తీయుల్లోనూ వ‌చ్చేసింది. అందుకే పెళ్లికి ముందు న‌చ్చిన వ్య‌క్తితో గ‌డిపేయ‌డం, చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిర‌గేయ‌డం…న‌చ్చితే సెక్సువ‌ల్‌గా క‌ల‌వ‌డం..ఆ త‌ర్వాత పెళ్లి చేసుకోవ‌డం జ‌రుగుతూ వ‌స్తోంది. దీన్ని లివింగ్ రిలేష‌న్ షిప్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఎక్కువుగా సెల్ర‌బెటీల్లోనూ జ‌రుగుతుంటాయి. పెళ్లిళ్లు కాకుండానే త‌ల్లిదండ్రులు అయిన‌వారు చాలా మంది ఉన్నారు. మనందరినీ తమ నటనతో లేక తమ ఆటతీరుతో ఇన్ స్పైర్ చేసే సెలబ్రిటీలు……ఇలాంటి వార్త‌ల‌తోనే ఎప్పుడూ మీడియా , జనాల నోళ్లల్లో నానుతూ ఉంటారు.

తాజాగా భారత ఆల్ రౌండర్ హార్దిక పాండ్యకు, ఆయన గర్ల్ ఫ్రెండ్ నటాషా స్టాన్కోవిచ్ కు……. ఒక పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఇలా పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్ లో ఉంటూ తల్లిదండ్రులు అయినా సెలబ్రెటీలు ఎవ‌రెవ‌రో ఒక‌సారి చూద్దాం. ఇలాంటి జంట‌ల్లో మొద‌ట‌ది నేహా దూపియా అంగ‌త్ బేడీ జోడీ. నేహా ధుపియా ఈమె బాలీవుడ్ లోనే కాదు…… తెలుగు సినిమాలలో కూడా నటించింది. మొదటిది రాజశేఖర్ తో నటించిన ‘ విలన్ ‘. ఇక రెండవది బాలకృష్ణ, దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పరమవీర చక్ర’. ఈమె తన బాయ్ ఫ్రెండ్ అంగత్ బేడీతో లివింగ్ లో ఉన్నప్పుడు…… ప్రెగ్నంట్ అయ్యింది.ఆతర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు.

ఆ త‌ర్వాత జోడి కొంక‌ణీ సేన్ శ‌ర్మ అండ్ ర‌ణ‌వీర్ షోరే. బాలీవుడ్ హీరోయిన్ కొంకణ సేన్ లివింగ్ లో ఉంటున్న సమయంలో….. ప్రెగ్నెంట్ అయ్యారు. ఆ తరువాతే పెళ్లి పీఠలు ఎక్కారు. పెళ్లికి ముందే త‌ల్లిదండ్రులై పెళ్లి చేసుకున్న మ‌రో జంట సారిక క‌మ‌ల్ హాస‌న్ జోడి. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్…….. చాలా కాలం పాటు సారికతో లివింగ్ లో ఉన్నారు. పెళ్లి కాక ముందే వీరికి శ్రుతి హాసన్ జన్మించింది. ఆ తరువాతే వీరు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు విడిపోయారు. ఆ త‌ర్వాత జోడి శ్రేదేవి అండ్ బోనీక‌పూర్ . జగదేక సుందరి శ్రీదేవి, బోనీకపూర్ తో కలిసి లివింగ్ లో ఉన్నారు. వారిద్దరూ వివాహం చేసుకునే స‌మ‌యానికి….. శ్రీదేవి 7 నెలల ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ఇక మ‌రో జోడీ సెలీనా జైట్లీ అండ్ పీట‌ర్ హాగ్. సెలీనా జైట్లీ బాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో న‌టించింది. తెలుగులో విష్ణుతో కలిసి సూర్యం అనే సినిమాలో న‌టించి మెప్పించింది. సెలీనా జైట్లీ తన బాయ్ ఫ్రెండ్ తో లివింగ్ రిలేష‌న్ షిప్‌లో ఉంది. అప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక పెళ్లికి ముందు త‌ల్లిదండ్రులైన మ‌రో సెల‌బ్రెటీ జోడి అమ్రితా అరోరా ష‌కీల్ ల‌ద‌న్ జోడి. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా సోద‌రి అమృతా అరోరా. అదేనండి గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాటకు డాన్స్ చేసిన బ్యూటీ చెల్లెలు ఈ అమ్రితా అరోరా. లివింగ్ లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయింది. ఇక తను ప్రెగ్నెంట్ అని తెలియడంతో …..హడావిడిగా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. ఇక మ‌రో జోడి మ‌హిమా చౌద‌రి అండ్ బాబీ ముఖ‌ర్జీ. బాలీవుడ్ నటి మహిమ చౌదరి ఆర్కిటెక్ట్ అయిన బాబీ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. సరిగ్గా పెళ్లి అయిన 5 నెలలకు వీరికి ఒక బిడ్డ జన్మించాడు. అంతే…పెళ్లికి ముందే గ‌ర్భం దాల్చింది మ‌హిమా చౌద‌రి. ఇక పెళ్లికి ముందే లివింగ్ రిలేష‌న్ షిప్ లో ఉండే పేరంట్స్ అయిన మ‌రో జంట ఎమీ జాక్స‌న్ అండ్ జార్జ్. తెలుగు,తమిళ భాషలలో చాలా సినిమాలు చేసిన ఈమె ……గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తన బాయ్ ఫ్రెండ్ తో లివింగ్ లో ఉంటున్న టైంలోనే ……ఎమీ జాక్సన్ ప్రెగ్నెంట్ అయ్యారు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక మ‌రో జోడి క‌ల్కి కొక్లేయిన్ అండ్ హ‌ర్ష బెర్గ్‌. నిజానికి బాలీవుడ్ న‌టి క‌ల్కి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను పెళ్లి చేసుకుంది. అయితే మ‌న‌స్ప‌ర్ధ‌ల కార‌ణంగా డైవ‌ర్స్ తీసుకుంది. ఆ త‌ర్ఆవ‌త తన బాయ్ ఫ్రెండ్ హర్ష బౌ తో లివింగ్ లో ఉంటున్నారు. ఇక లివింగ్ లో ఉండగానే ….ఈమె కూడా తల్లి అయ్యింది. తాజాగా ట్రెండ్ సెట్ చేసిన మ‌రో జోడీ హార్దిక్ పాండ్యా న‌టాషా స్టాన్కో విచ్‌. తన సెర్బియన్ గర్ల్ ఫ్రెండ్ నటాషా స్టాన్కోవిచ్ తో …..చాలా రోజుల నుండి లివింగ్ లో ఉంటున్న హార్దిక్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఆ ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. వీరిద్ద‌రూ స‌ముద్రం న‌డిబొడ్డున షిప్ లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇలా చాలా మంది సినీ, స్పోర్ట్స్ సెల‌బ్రెటీలు పెళ్లి కాకుండా త‌ల్లిదండ్రులై….లివింగ్ రిలేష‌న్ షిప్‌ను ప‌బ్లిసిటీ లేకుండానే ప్ర‌చారం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad