Home టాప్ స్టోరీస్ కామాతురాణాం న కరోనా

కామాతురాణాం న కరోనా

Forcing2

“కామాతురాణాం న భయం న లజ్జ” అంటారు.. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా “న కరోనా” అనే పదం కూడా యాడ్ చేసుకోవాలేమో. దేశంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి జరిగిన ఘటనలు చూస్తే ఇలానే అనిపిస్తుంది. కరోనా బాధితురాలు అని తెలిసి కూడా భయపడకుండా, ముందువెనక ఆలోచించకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

ఢిల్లీలోని ఛత్తార్ పూర్ లో ఉన్న 14 ఏళ్ల బాలికకు కరోనా సోకింది. వెంటనే ఆమెను సర్దార్ పటేల్ కరోనా సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆమె అదే క్వారంటైన్ సెంటర్ లో ఉంటోంది. ఓరోజు రాత్రి బాత్ రూమ్ కు వెళ్లగా.. సరైన టైమ్ చూసి ఓ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కరోనా ఉందని తెలిసి కూడా ఆ 20 ఏళ్ల వ్యక్తి ఏమాత్రం ఆలోచించలేదు.  

సరిగ్గా ఇలాంటి ఘటనే అలీఘడ్ లో కూడా జరిగింది. ఇక్కడ ఏకంగా ట్రీట్ మెంట్ చేయాల్సిన వైద్యుడే, కరోనా బాధితురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. కొన్ని రోజుల కిందట కరోనా పాజిటివ్ తో దీన్ దయాల్ హాస్పిటల్ లో చేరింది 25 ఏళ్ల యువతి. కొన్ని రోజులుగా ఆమెకు చికిత్స అందిస్తున్న తుఫైల్ అహ్మద్ అనే వ్యక్తి, సరైన సమయం కోసం ఎదురుచూశాడు. బుధవారం రాత్రి ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించాడు.

తీవ్రంగా ప్రతిఘటించి, డాక్టర్ ను అడ్డుకున్న సదరు మహిళ.. స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వైద్యుడ్ని అరెస్ట్ చేశారు. ఇలా కరోనా ఉందని తెలిసి కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగడం సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad