యూట్యూబ్ ని ఫాలో అయ్యేవారికి యూట్యూబర్ హర్ష సాయి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలామంది యూట్యూబ్ లో ఫన్నీ వీడియోలు, వంటలు, వ్లాగ్స్, చిన్న చిన్న సిరీస్ లు పెడుతుంటారు. కానీ హర్ష సాయి మాత్రం పూర్తిగా భిన్నం. ఇతడు తన సబ్‌స్క్రైబర్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. వారి మనుసులో ఉండే చిన్న చిన్న కోరికలును తీర్చి.. సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. హర్ష సాయి వీడియోల్లో ఎక్కువ శాతం ఇలాంటివే ఉంటాయి. ఇక హర్ష సాయి చానెల్ కు సబ్‌స్క్రైబర్లు కూడా ఓ రేంజ్ లో ఉంటారు. తాజాగా తన సబ్‌స్క్రైబర్లు ఇద్దరి కోసం హర్ష సాయి చేసిన ప్రయోగం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అతడు చేసిన పనికి.. జనాలు హర్ష సాయిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
ఓ రోజు ఇద్దరు స్నేహితులు పెట్రోల్ డబ్బుల గురించి గొడవపడటం హర్ష సాయి దృష్టికి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరు తన సబ్‌స్క్రైబర్లు అని తెలిసింది. వారికి ఉచితంగా పెట్రోల్ అందించాలని భావించిన హర్ష సాయి.. అందుకు కోసం ఏకంగా ఫ్రీ పెట్రోల్ బంక్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇద్దరు సబ్‌స్క్రైబర్ల వివరాలు హర్ష సాయికి తెలియదు. తను ఈ ఫ్రీ పెట్రోల్ బంక్ ని ఏర్పాటు చేసిందే.. ఆ ఇద్దరు సబ్ స్క్రైబర్ల కోసం. కనుక దీని గురించి వారికి తెలియడం కోసం పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్స్ లు ఏర్పాటు చేశాడు.
తన టీమ్ సాయంతో.. వారిలో ఒకరి అడ్రెస్ సంపాదించాడు. ఇక ఈ ఫ్రీ పెట్రోల్ బంక్ కి వచ్చిన వారందరికి ఉచితంగా పెట్రోల్ అందించడమే కాక.. పలు గేమ్స్ నిర్వహించి.. వారికి ఊహించని బహుమతులు గిఫ్ట్ గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఇదుకు సంబంధించిన వీడియో వైరలవ్వడమే కాక.. టాప్ 1 లో ట్రెండింగ్ అవుతోంది. పూర్తి వివరాల కోసం కింద వీడియోని చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.