విజ్ఞానం పెరిగిందని సంతోషించాలో.. లేక అది మనలోని మానవత్వావాన్ని, స్పందించే గుణాన్ని చంపేసిందని బాధపడాలో అర్థం కానీ పరిస్థితుల్లో బతుకుతున్నాం. రోడ్డు మీద.. వందల మంది సమక్షంలో హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నా చోద్యం చూస్తున్నాం తప్పితే.. వెళ్లి.. కాపాడే ప్రయత్నం చేద్దామనే ఆలోచన మనలో కొరవడుతోంది. అమ్మో దగ్గరకు వెళ్తే.. మన మీద దాడి చేస్తారేమో అనే భయం.. ఎవరికి లేనిది మనకేందుకు అనే నిర్లక్ష్యం మనల్ని ఆవరించింది. కళ్ల ముందు నిత్యం జరిగే సంఘటనలకు స్పందించాలనే ఆలోచన కనుమరుగవుతుంది. కేవలం టీవీ, స్మార్ట్‌ఫోన్‌లో వస్తే మాత్రమే అయ్యో పాపం.. ఇలా జరగకూడదు.. లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని.. ఆవేశంగా కామెంట్స్ పెట్టడం మాత్రం చేస్తాం.
ఇక కొందరు ఇంతకు మించిన ప్రబుద్ధులు ఉంటారు. మంచి, చెడు విచక్షణ ఏం ఉండదు.. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని బుద్ధి హీనులుంటారు. ఘోరం జరిగి దారుణం సంఘటనలు చోటు చేసుకుంటుంటే.. వీరు మాత్రం తమలోని పైత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి వారి గురిచి ఓ సామెత కూడా ఉంది.. అదే ఇల్లు తగలబడుతుంటే.. చుట్ట కాల్చుకుంటారు అని. ఇప్పుడు ఈ ఫోటో చూస్తే.. వీరు కూడా ఆ కోవకు చెందిన వారే అని అర్థం అవుతుంది. ఓ వైపు రైలు తగలబెట్టి.. ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే.. ఇదిగో వీరు మాత్రం.. ఇలా సెల్ఫీలు తీసుకుని మురిసిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Agnipath: అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు! కారణం?
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా నిరసన సెన తగులుతోంది. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. తగులబెట్టారు. ఇక నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్సులు జరపడంతో.. ఒకరు మృతి చెందారు.
ఇది కూడా చదవండి: Secunderabad Railway Station: సికింద్రాబాద్ అల్లర్లలో షాకింగ్ ట్విస్ట్! అల్లర్ల వెనుక మాస్టర్ ప్లాన్?
ప్రస్తుతం సికింద్రబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదిగో ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో.. కొందరు ఇదేదో ఘనకార్యం అని భావించి.. ఇలా సెల్ఫీలు దిగుతూ సంబరపడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజనులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. రైలు తగలబెట్టి.. హింసాకాండ సృష్టించి.. పైగా అదేదో ఘనకార్యం అన్నట్లు.. ఈ సెల్ఫీలు ఏంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం.. రైళ్లు, స్టాళ్లు తగలబెట్టిన ఆర్మీ అభ్యర్థులు!!