పెళ్లితో ఇబ్బందులు లేకుండా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేందుకు వారంతపు పెళ్లి చేసుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు వారంతపు పెళ్లిళ్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు ఏంటనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పెళ్లి… ఈ పదం ఎత్తగానే ఈ రోజుల్లో చాలా మంది యువత భయంతో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇక పెళ్లి చేసుకుంటే బరువు, బాధ్యత తో పాటు స్వేచ్ఛా జీవితం అస్సలు ఉండదని కొందరు యువతి యువకులు పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇక కొందరైతే.. చదువు పేరుతో కాలక్షేపం చేయడమే కాకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ.. చివరికి పెళ్లికాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు.
అయితే పెళ్లితో ఇబ్బందులు లేకుండా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేందుకు వారంతపు పెళ్లి చేసుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. వారంతపు పెళ్లిళ్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. వీకెండ్ పెళ్లిళ్లు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. పైగా ఇలాంటి పెళ్లిళ్లు అసలు మన ఇండియాలో ఎక్కడా కూడా కనిపించవు కదా అనే ప్రశ్న రావొచ్చు. కానీ, ఇలాంటి పెళ్లిళ్లు మాత్రం ఎక్కువగా జపాన్ దేశంలో జరుగుతున్నాయి. అసలు వీకెండ్ మ్యారేజ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇద్దరు పెళ్లి చేసుకున్న జంటలు రోజూ కాకుండా వారంతల్లోనే కలిసి ఉంటారు. ఇక మిగతా రోజుల్లో మాత్రం ఎవరి లైఫ్ ను వాళ్లు లీడ్ చేస్తూ స్వేచ్ఛ జీవులుగా సంతోషంగా బతుకున్నారు. ఇలాంటి వీకెండ్ మ్యారేజ్ లు చేసుకోవడం వల్ల ఉపయోగాలే తప్పా.. నష్టాలు లేవని చెబుతున్నారు. ఎందుకంటే..? వారంతపు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల భార్యాభర్తలు రోజూ కలిసి ఉండరు. వారంతంలో మాత్రమే కలిసి ఉంటారు.
కాబట్టి ఈ దంపతుల మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్థలు రావడానికి ఆస్కారం లేదని అంటున్నారు. దీంతో ఈ దంపతులు ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చని కొందరు జపాన్ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీంతో పాటు తక్కువ కాలంలో రెట్టింపు ప్రేమగా ఉండొచ్చని కూడా చెబుతున్నారు. దీని కారణంగానే జపాన్ లో ప్రస్తుతం వీకెంట్ మ్యారేజ్ లు చేసుకోవడానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారంతపు పెళ్లిళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.