ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాపకం ఉంటుంది. కొందరికి పాటలు పాడడం, ఆటలు ఆడడం, డ్యాన్సులు చేయడం, ఆక్టింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని వారి వారి ప్రతిభను సోషల్ మీడియ ద్వారా వ్యక్తపరుస్తుంటారు. అయితే కొందరు రీల్స్ చేయడం కోసం పబ్లిక్ ప్లేసులు. ప్రైవేట్ ప్లేసులు అని చూడకుండా ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తుంటారు. కొన్ని సార్లు ప్రమాదకర ప్రదేశాల్లో రీల్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

ఈ మధ్య ఇన్ స్టాగ్రాం రీల్స్ కోసం కొంత మంది యువతీ యువకులు రేల్వే స్టేషన్లు, మెట్రోస్టేషన్లలో ఇబ్బంది కరంగా డ్యాన్సులు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఆ మధ్య ఓ యువకుడు రైల్వే ట్రాక్ వద్ద వీడియో చేస్తుండగా ట్రైన్ ఢీ కొనడంతో ప్రాణాలొదిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ యువతి ర్వేల్వే ట్రాక్ పై డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
ఓ యువతి నీలం రంగు చీర కట్టుకుని రైల్వే ట్రాక్ పై డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ట్రాక్ మధ్యలో హర్యాన్వీ పాటకు డ్యాన్సు చేసింది. అయితే ఈ వీడియోను చూసిన వారు ఆ యువతి పై మండిపడ్డారు. ఇలా ప్రమాదకర ప్లేస్ లో రీల్స్ చేయడం అవసరమా అని అంటున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను కోరారు. ఓ వ్యక్తి ముంబై పోలీసులకు దీనిని ట్యాగ్ చేస్తూ ఎఫ్ ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరాడు. రేల్వే ట్రాక్ ల వద్ద, మెట్రో స్టేషన్లలో ఇలా రీల్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు యువవతీ యువకులను హెచ్చరిస్తున్నారు.