మాములుగా సమాజంలో చాలామంది జంతు ప్రేమికులు ఉంటారు. ప్రేమగా పిల్లులను, కుక్కలను, పావురాలను వంటి జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఇక ఇంతటితో ఆగకుండా.. ఆ జంతువులకు స్నానం చేయించడంతో పాటు ముద్దులు ఇవ్వడం, లాలించడం చేస్తుంటారు. ఇదే కాకుండా చివరికి వారు పడుకునే బెడ్ రూమ్ వరకు తీసుకెళ్లి వారి పక్కనే పడుకోబెట్టుకుంటారు. ఇది అంత మాములే కాదా.. ఇందులో ఆశ్చర్యం ఏముంది అని మీరు అనుకొవచ్చు. కానీ ఓ యువతి మాత్రం ఏకంగా చిరుత పులి పక్కన పడుకుని దాంతో ఫొటో దిగడమే కాకుండా.. ఏకంగా చిరుతకే లిప్ లాక్ ఇచ్చేసింది.
ఆ పులి కూడా ఆ యువతి పెదాలను జుర్రుతు కనిపించింది. అలా చిరుత పులిని ముద్దులతో ముంచెత్తుతూ ఆ యువతి వీడియెను తీసుకుంది. ఇక ఇదే వీడియోను ఆఫ్రికన్ ఎనిమల్ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అయితే ఆ యువతి ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇక ఈ వీడియోను చూసిన చాలా మంది ఇదేందిరా బాబు.. ఆ పిల్ల ఏకంగా ఆ చిరుత పులికి ముద్దులే ఇచ్చేస్తుంది. ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.