ఫేమస్ అవ్వడం కోసం పిచ్చి పిచ్చి చేష్టలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు కొంత మంది యువత. మెట్రో రైళ్లలో బ్రష్ చేయడం, టవల్‌తో తిరగడం, డ్యాన్సులు చేయడం చూశాం. అలాగే ఇక రోడ్డుపై వీరి చేయని వీరంగం లేదు. బైకులపై అమ్మాయిల ముందు స్కిట్లు చేయడాలు లేదంటే..
ఇటీవల ఫేమస్ అవ్వడం కోసం పిచ్చి పిచ్చి చేష్టలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు కొంత మంది యువత. మెట్రో రైళ్లలో బ్రష్ చేయడం, టవల్‌తో తిరగడం, డ్యాన్సులు చేయడం చూశాం. అలాగే ఇక రోడ్డుపై వీరి చేయని వీరంగం లేదు. బైకులపై అమ్మాయిల ముందు స్కిట్లు చేయడాలు లేదంటే అమ్మాయిల ముందు ఎక్కించుకుని ప్రయాణించడం వంటి ఘటనలు కూడా తిలకించాం. ఫన్ కోసమో, రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలన్న ఆలోచనే తెలియదు కానీ.. ఈ చర్యలు జుగుప్సాకరంగా ఉండటమే కాకుండా ఇతరులకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇటువంటి ఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు యువకులు.. వైరల్ అవ్వడం కోసం రోడ్డుపై పిచ్చి పనులు చేసి వార్తల్లో నిలిచారు. వర్షం వస్తుండగా.. అర్థనగ్నంగా మారి బైక్ పై చక్కర్లు కొట్టారు. అంతేకాకుండా సబ్బు తీసుకుని స్నానం కూడా చేశారు. ఇది రోడ్డు మీద ఉన్న కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్తా ట్రాఫిక్ పోలీసుల దృష్టిలో పడింది. దీంతో బైక్ నంబర్ యుపి 78 ఉన్న నెంబర్ ఆధారంగా ఇప్పుడు వారికి కోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఈ బైక్ కాన్పూర్‌కు చెందినదిగా తేలింది. వీరిద్దరిపై కేసు నమోదు చేసి, విచారణకు ఆదేశించారు. బైక్ పై అర్థనగ్నంగా స్నానం చేస్తూ, ఇతరులకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫన్ కోసం చేస్తే..చివరకు ఇలా అయ్యింది.