ఓ వ్యక్తిని ప్రేమించటం ఒక ఎత్తయితే.. ప్రేమించిన వ్యక్తికి ప్రేమను తెలియజేయటం మరో ఎత్తు. ‘‘ నేను నిన్ను ఇష్టపడుతున్నాను’’ అని చెప్పటం ఎంత కష్టమో.. దాన్ని అనుభవిస్తున్న వారికి మాత్రమే తెలుసు..
ప్రేమించటం అందరూ చేస్తారు.. కానీ, ప్రేమించిన వారికి ధైర్యంగా తమ ప్రేమను చెప్పేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అన్నిటికి సిద్ధపడ్డవారే ఎదుటి వ్యక్తికి తమ ప్రేమను చెప్పగలరు. ఎదుటి వ్యక్తి తమను ఇష్టపడుతున్నారని గట్టిగా నమ్మి నపుడు ప్రపోజ్ చేయాలన్న కోరిక బలపడుతుంది. ఆడకావచ్చు.. మగకావచ్చు.. ఎదుటి వ్యక్తికి ప్రపోజ్ చేయటంలో ఒక్కోరు ఒక్కో స్టైల్‌ను ఫాలో అవుతుంటారు. ఎదుటి వ్యక్తి మనల్ని ఇష్ట పడ్డం నిజమైతే కొన్నిసార్లు ప్రపోజ్ చేసిన వెంటనే ఒకే చేసేస్తారు. మన ప్రపోజల్ స్టైల్ నచ్చితే వారి జీవితంలో అది ఎప్పుడూ గుర్తుండిపోతుంది.
తాజాగా, ఓ వ్యక్తి తన ప్రియురాలికి ప్రపోజ్ చేసిన విధానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతడు ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే.. తాను ఎంతగానో ఇష్టపడుతున్న ప్రియురాలికి కీబోర్డు ద్వారా తన ప్రేమను తెలిపాడు. సాధరణంగా కీబోర్డు మీద కీలు.. టైపింగ్‌కు తగినట్లుగా ఉంటాయి. కానీ, ఆ కీలను తాను చెప్పాలనుకున్న మాటల రూపంలోకి మార్చాడు. ‘‘ నువ్వు నా ప్రియురాలిగా ఉండు సే హంగ్’’ అని వచ్చేట్లుగా కీలను అమర్చాడు. ఈ ప్రపోజల్ సే హంగ్‌కు ఎంతో నచ్చింది. అతడికి వెంటనే ఓకే చెప్పింది. తర్వాత కీబోర్డును ఫొటో తీసింది.
ఈ ఫొటోతో పాటు ప్రియుడితో దిగిన సెల్ఫీని కూడా జతచేసి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘‘ నేను ఎప్పటికీ దీన్ని మర్చిపోలేను. కీబోర్డు ద్వారా అతడు నాకు ప్రపోజ్ చేశాడు’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘ ఇలా కూడా ప్రపోజ్ చేస్తారా?’’.. ‘‘ ఎంత కొత్తగా ప్రపోజ్ చేస్తే.. అమ్మాయిలు అంత ఈజీగా పడిపోతారు’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ కొత్త ప్రపోజింగ్ స్టైల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
i’ll never shut up about this, he proposed me to be his girlfriend with a keyboard. https://t.co/G8GDpsD62z pic.twitter.com/iPbCZ1zEdA
— 에이미 (@amymaymacc) April 29, 2023