ఆమె ప్రియుడు ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ప్రసుత్తం అవి వైరల్‌గా మారాయి. వాటిపై స్పందిస్తున్న నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
మనుషులకు మనుషులకు మధ్య డైరెక్ట్ సంబంధాలు తగ్గిపోయాయి. బాధ వచ్చినా సంతోషం వచ్చినా సోషల్ మీడియా ద్వారా వ్యక్త పర్చటం చేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్‌లో స్టాటస్‌లు పెట్టడమో.. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టడమో చేస్తున్నారు. వాటిలో వింతగా ఉన్నవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉన్నాయి. తాజాగా, ఓ యువకుడు తన ప్రియురాలిపై ఉన్న చిరు కోపాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచాడు. ఆమెతో ప్రేమలో పడటం తాను చేసిన పెద్ద తప్పుగా వాపోయాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తర భారత దేశానికి చెందిన ఓ యువతికి సోంపుకు, జీలకర్రకు తేడా తెలియదు. ఓ రోజు వంట చేస్తున్న ఆమెకు ఏది సోంపో.. ఏది జీలకర్రో అర్థం కాలేదు. వెంటనే తన ప్రియుడికి వాట్సాప్‌లో ఫొటోలు పెట్టి ఏది ఏంటని అడిగింది. అతడు వివరించి చెప్పాడు. అనంతరం ఇద్దరి మధ్యా జరిగిన వాట్సాప్ చాట్‌లను స్క్రీన్ షాట్లు తీశాడు. తర్వాత వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ‘సారీ.. నేను ఏమీ తెలియని అమ్మాయి దగ్గర ఇరుక్కుపోయాను’ అంటూ వాపోయాడు.
ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ పాపం బ్రో.. ఇలా ఇరుక్కుపోయావేంటి?’’.. ‘‘ నువ్వు అసలు అమ్మాయివేనా.. సోంపుకు, జీలకర్రకు కూడా తేడా తెలీదా’’.. ‘‘ ఈ కాలం అమ్మాయిలకు వంట చేయటం కూడా రాదు.. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’’.. ‘‘ బాధ పడకు బ్రో పెళ్లి తర్వాత అన్నీ సర్దుకుంటాయిలే’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sorry mumma main galat ladki ke sath fass gya 😭😭😭 pic.twitter.com/Yy328pQFSw
— Sumit✨ (@Anteryamiiii) April 3, 2023