వాన వస్తుందంటే చాలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీస్తారు. కానీ తడుద్దామని వెళ్లిన ఓ నగర వాసులకు వింత అనుభవం ఎదురైంది. వర్షానికి భయపడి ఇళ్లలోకి పరుగెత్తారు. వడగళ్ల వానో, చేపలో వానో పడిందనుకునేరు. కానే కాదూ.. ఏ వాన పడిందంటే..?
వాన అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. అందులోనూ మండిపోతున్న ఎండల సమయంలో వానలు కురుస్తుంటే ఎట్టా ఉంటుంది. అబ్బా ప్రాణానికి హాయిగా ఉంటుంది. కాసేపు వానలో తడవాలని అనిపిస్తోంది. వర్షం పడటం ఆలస్యం రోడ్డు మీదకు పరుగులు పెడుతుంటాం. పెద్దలతో పాటు పిల్లలు కూడా వానను ఎంజాయ్ చేస్తారు. అయితే వడగళ్లు వానల సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లో కూర్చుని తిలకిస్తాం. వర్షం పడుతుంటే తడిసి ముద్దవ్వాలని భావించిన ఆ నగర వాసులకు వింత అనుభవం ఎదురైంది. వర్షం పడిన కొద్ది సేపటికే ఇళ్లల్లోకి పరుగులు పెట్టారట. ఇంతకు ఏం వాన పడిందంటే..? ఎక్కడ జరిగిందంటే..?
వర్షం పడే సమయంలో వడగళ్లు, చేపలు, కప్పలు పడుతుంటడం చూస్తాం. కానీ చైనాలోని ఓ నగరానికి చెందిన వాసులు వింత వానలో తడిశారు. ఇంతకు ఆ వానేమిటంటే.. పురుగుల వాన. హా.. చా అనుకుంటున్నారా.. అవునండీ వానపాములు, జలగల వాన పడిందట. అంతే ఎంత స్పీడుగా రోడ్ల మీదకు వచ్చారో, అంతే స్పీడుగా ఇళ్లలోకి పరిగెత్తారట. ఈ ఘటన లియోనింగ్ ప్రావిన్స్‌లో జరిగింది. రోడ్డు మీద, రహదారుల మీద పార్క్ చేసిన కార్ల మీద.. ఎక్కడ చూసినా అవే. ఈ ఘటన గత నెలలో జరగ్గా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెరువులు, సముద్రాల్లో ఏర్పడ్డ సుడిగుండాల (టోర్నాడో) వల్ల వానపాములు, జలగలు పైకి వెళ్లాయని, అవే ఇప్పుడు వర్షం రూపంలో చైనాలో పడ్డాయని నిపుణులు చెబుతున్నారు.