సీజనల్ ఫ్రూట్స్ లో కింగ్ మేకర్ మామిడి కాయే . వేసవి వస్తే చాలు.. అంతా మామిడిని టేస్ట్ చేయకుండా ఉండలేరు. ఇక మామిడిలో ఉండే రకాలు ఎన్నో. కానీ.., ఎంత మేలు రకమైన మామిడి అయినా.. కాస్ట్ ఎంత ఉంటుంది? మహా అయితే ఓ 200 రూపాయలు ఉండవచ్చు. కానీ.., ఒక కేజీ మామిడి ధర రూ.2.75 లక్షల అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది నిజం కాబట్టి. మాములుగా మంచి టేస్ట్ ఉండే మామిడి అంటే మనం బంగినపల్లి అని చెప్తాము. కానీ.., జపాన్‍లో ఎక్కువగా పండించే టాయో నో టామ్‍గామ్ పండు గురించి మీకు తెలుసా?
టాయో నో టామ్‍గామ్ ప్రపంచంలో కెల్లా అత్యంత రుచికరమైన మామిడి పండు. చూడటానికి ఇది ఎర్రగా ఉంటుంది. ఇందుకే వీటిని ‘ఎగ్స్ ఆఫ్ సన్’… ‘సూర్యుని గుడ్లు’ అని పిలుస్తుంటారు. జపాన్‌తో పాటు వరల్డ్ మార్కెట్‌లో ఈ రకం మ్యాంగోస్‌కు మంచి గిరాకీ ఉంది. కానీ.., చిత్రం ఏమిటంటే అన్నీ రకాల వాతావరణ పరిస్థితిల్లో ఈ రకం కాయలను ఇచ్చే చెట్లు పెరగవు. ఇంకా చెప్పాలంటే అసలు టాయో నో టామ్‍గామ్ సీడ్ మనకి బయట ఎక్కడా లభించదు.
ఈ చెట్లు ఎక్కడ ఉన్నా.., వీటికి టైట్ సెక్యూరిటీ ఉంటుంది. కేవలం కాయలు కాచే సమయంలోనే కాక.., ఏడాది పొడవునా ఈ చెట్లకి సెక్యూరిటీ ఉంచుతారు. ఇంతటి అరుదైన మామిడి కాయలను ఇచ్చే చెట్లు ఇప్పుడు మన ఇండియాలో పుట్టుకొచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లోని సంకల్ప్, రాణి పరిహార్ అనే కపుల్స్.. ‘టాయో నో టామాగో’ రకం మామిడిని పండిస్తున్నారు. వారి చెట్లకు కాసిన మామిడి పండ్లు కిలో ధర రికార్డు స్థాయిలో సుమారు రూ.2.75 లక్షలు పలుకుతోంది. పైగా.., ఇంతటి ధర పెట్టి కొనడానికి వ్యాపారులు పోటీ పడుతుండటం విశేషం. దీంతో.., వీరు ఇప్పుడు ఈ చెట్లకి నలుగురు గార్డ్స్ ని, 6 కుక్కలను కాపలాగా కూడా పెట్టుకున్నారు. వీటిలో ఒక్కో చెట్టుకు దాదాపు 20 పండ్లు కాస్తున్నాయి. ఈ లెక్కన.. ఒక్క చెట్టుంటే.. 40 లక్షల ఆదాయం. అలాంటిది ఇక మామిడి తోటే ఉంటే..? పంట పండినట్టే.