మనలో చాలామందికి అన్నీ తెలుసు అనుకుంటాం. ఏదైనా ప్రశ్న అడగగానే తెల్లమొహం వేస్తాం. ఒకవేళ తెలిసినా మనకు పట్టున్న అంశాల్లో అడగాలని కోరచ్చు. కానీ ఈ బుడతడు మాత్రం టకాటకా 700 ప్రశ్నలకు గుక్కతిప్పుకోకుండా సమాధానాలు చెప్పేస్తున్నారు. అదీ, ఇదీ అని కాదు ఇన్వెన్షన్స్, వరల్డ్ వార్ల నుంచి శరీరంలోని భాగాలు, వ్యాధులు వాటికి మూలాలు అంటూ సోషల్, సైన్స్, సినిమా, అవార్డులు, అబ్రివేషన్లు అంటూ అన్నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేస్తున్నారు ఈ చిచ్చర పిడుగులు.
ఆ బుడతలు ఇద్దరూ జోనథన్ బ్రదర్స్‌గా మంచి పేరు, ప్రఖ్యాతలు సాధించారు. వీరికి జాతీయ, అంతర్జాతీ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. ఎన్నో అవార్డులు, రివార్డులు వీరి సొంతం. వీరు ఇదంతా నేర్చుకుంది ఎక్కడో కాదు వారి తల్లిదండ్రులే వారి గురువులు. ఆ జోనథన్ బ్రదర్స్‌ని సుమన్ టీవీ చేసిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి వాళ్లు చెప్పిన సమాధానలు ఏంటో మీరు ఓ లుక్కేయండి.