Railway Track: రైలు పట్టాల మధ్యలో పడి ప్రాణాలతో బ్రతికిన వాళ్లు చాలా మందే ఉంటారు. వారంతా రైలు పట్టాల కిందపడి, రైలు మీదనుంచి పోయినపుడు భయంతో బిక్కచచ్చిపోయి ఉంటారు. ప్రాణాలతో బయటపడినా.. ఆ భయంలోంచి బయటపడ్డానికి చాలా సమయమే పట్టి ఉంటుంది. కానీ, ఓ యువతి మాత్రం తన మీద నుంచి రైలు పోయినా ఏ మాత్రం భయపడలేదు. అసలేం జరగలేదు అన్నట్లు ఫోన్‌లో కబుర్లు చెప్పుకుంటూ వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఓ యువతి ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న రైల్యే స్టేషన్‌కు వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతూ అటునుంచి ఇటుకు పట్టాలు దాటటానికి ప్రయత్నించింది. ఊహించన విధంగా రైలు సర్రున దూసుకువచ్చింది. ఇది గమనించిన యువతి ఠక్కున కింద పట్టాలపై పడుకుంది.
రైలు మీదనుంచి పోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. రైలు పోయిన కొద్ది సేపటికి యువతి లేచి కూర్చుంది. వెంటనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం మొదలుపెట్టింది. దీన్నంతా వీడియో తీస్తున్న ఓ యువకుడు ఏదో ప్రశ్న అడగ్గా.. పక్కకు తిరగకుండానే సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. నీకు ఇంత గుండె ధైర్యం ఎక్కడిదమ్మా అంటూ సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు. మరి, యువతి గుండె ధైర్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి :
फ़ोन पर gossip, ज़्यादा ज़रूरी है 🤦🏻♂️ pic.twitter.com/H4ejmzyVak
— Dipanshu Kabra (@ipskabra) April 12, 2022