తమిళనాడు ఈరోడ్‌కు చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం బాగా తాగి నడిరోడ్డుపైకి వచ్చింది. తాగిన మత్తులో ఆమె రోడ్డుపై తూలుతూ అటు ఇటు తిరగసాగింది.
మత్తుకు మనుషుల్ని చిత్తు చేసే పాడు బుద్ధి ఉంది. ఒకసారి మత్తుకు బానిసైతే ఎంతటి వారైనా ఇబ్బందుల పాలు కాకతప్పదు. ఇందుకు ఆడ,మగ అన్న తేడా ఉండదు. ఎవ్వరైనా సరే ఇబ్బంది పాలు కాకతప్పదు. తాజాగా, ఓ మహిళ మద్యం మత్తులో హల్‌చల్ చేసింది. నడిరోడ్డుపై దారుణంగా ప్రవర్తించింది. రోడ్డుపై వెళుతున్న వారిని కొడుతూ.. వారిపై ఉమ్ముతూ తప్పుతప్పుగా ప్రవర్తించింది. ఈ సంఘటన తమిళనాడులోని ఈరోడ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
తమిళనాడు ఈరోడ్‌కు చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం బాగా తాగి నడిరోడ్డుపైకి వచ్చింది. తాగిన మత్తులో ఆమె రోడ్డుపై తూలుతూ అటు ఇటు తిరగసాగింది. ఆమె అలా రోడ్డుపై తిరుగుతుంటే కొంతమంది వ్యక్తులు ఆమెను పక్కకు రమ్మని చెప్పారు. దీంతో ఆమె ఆగ్రహానికి గురైంది. వారిపైకి తిరబడింది. తనను పక్కకు రమ్మన్న వారిని కొడుతూ.. వారిపై ఉమ్ముతూ హల్ చల్ చేసింది. ఆమె అంతటితో ఆగకుండా.. రోడ్డుపై అటు, ఇటు తిరుగుతూ మిగిలిన వారిని కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది.
బైకులతో పాటు ఇతర వాహనాల్లో వెళుతున్న వారిని కొడుతూ.. వారిపై ఉమ్ముతూ తిక్క తిక్కగా ప్రవర్తించింది. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. సమచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సదరు మహిళ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
எச்சில் துப்பி, பொதுமக்களை அடிக்க பாய்ந்தும் .. நடுரோட்டில் போதை பெண்ணின் அட்டகாசம்https://t.co/hNmvZGX0Fr#drunker #alcohol #erode #thanthitv
— Thanthi TV (@ThanthiTV) May 27, 2023