మన సమాజంలో రాను రాను వివాహం అనే మాటకు అర్థమే మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పెళ్లి అంటే స్త్రీ, పురుషులకు ముడివేసే బంధం. కానీ నేడు సమాజంలో గే వివాహాలు పెరిగాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకొబోయే పెళ్లి.. దీనికి మించినది. ఆవివరాలు..
సాధారణంగా వివాహం సమయంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు పెద్దలు. ఇది వినగానే చాలా మంది.. పెళ్లి చేసుకోబోయే వధూవరులు, వారి తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటే సరిపోతుంది కదా.. మరి తరాల వరకు వారి వివరాలు తెలుసుకోవడం అవసరమా అంటారు. అసలు పెద్దవారు ఎందుకు ఇలాంటి కట్టుబాట్లను పెట్టారో ఒక్క నిమిషం కూడా ఆలోచించం.. సందు దొరికింది కదా అని వారిని విమర్శిస్తాం. కానీ పెద్దలు ఓ మాట చెప్పారు అంటే దాని వెనక ఏదో బలమైన కారణమే ఉంటుంది. ఇప్పుడు వివాహం విషయానికి వస్తే.. కుటుంబ చరిత్ర చూడమని ఎందుకు చెబుతారు అంటే.. మనం వియ్యం అందుకోబోయే కుటుంబంతో.. ఎక్కడైనా బంధం కలిసిందా.. వరసల్లో ఎక్కడైనా చిక్కులు వస్తే.. అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అన్నారు. కాదు అంటే ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే లాంటి విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి.
మన సమాజంలో.. ఆడపిల్లలు వయసులో తమ కన్నా పెద్దవాళ్లు అయిన అబ్బాయిలను అన్న అని పిలుస్తారు. అబ్బాయిలయితే అక్కా అంటారు. అలా వారి మధ్య సోదర భావం, బంధం ఏర్పడుతుంది. ఇక అన్న, అక్క అని పిలిస్తే.. వారిని తోబుట్టువుల మాదిరే చూస్తాం.. తప్ప వారి గురించి ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే జంట.. మాత్రం వావి వరసలు మరిచి.. వివాహం చేసుకున్నారు. పైగా తామేదో ఘనకార్యం చేసినట్లు.. దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజనులు.. ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఓ యువతి తన చిన్నప్పటి నుంచి అన్నయ్య అని పిలిచిన యువకుడిని పెళ్లి చేసుకుంది. వారికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. సరే వివాహం చేసుకున్నారు.. బిడ్డను కన్నారు.. అలా కామ్‌గా ఉంటే బాగుండేది. కానీ సదరు మహిళ తమ విచిత్ర లవ్ స్టోరీ గురించి స్వయంగా బయట పెట్టే సరికి .. వారిని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు.
ఈ విచిత్ర దంపతుల పేర్లు.. విని, జై. వీరు ఇన్‌స్టాలో జాయింట్ అకౌంట్ వినియోగిస్తారు. ఇద్దరూ కలిసి వీడియోలు, రీల్స్ చేసి.. వాటిని తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు ఈ జంట తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి కూడా రీల్స్, వీడియోలు చేస్తూ.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఈ జంట.. ఇన్‌స్టాలో ఓ షాకింగ్ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోవడంతో పాటు.. అసహ్యించుకుంటున్నారు కూడా. ఇంతకు ఆ వీడియోలో ఏం ఉంది అంటే..
ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో విని తన ప్రేమ, పెళ్లి గురి వివరిస్తూ.. తన భర్త జై ని.. చిన్ననాటి నుండే భయ్యా (అన్నయ్య) అని పిలిచే దానినని ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చింది. చిన్నప్పుడూ స్నేహితులుగా ఉన్నా.. పెద్దయ్యాక ఆ స్నేహం కొనసాగించలేకపోయాం అని తెలిపింది. పైగా జై… వినికి దూరపు బంధువు కావడంతో అతడిని భయ్యా అని పిలిచే దాన్ని అని.. అలా ఎనిమిదేళ్ల పాటు.. తనని అన్నయ్య అని పిలిచానని చెప్పుకొచ్చింది. ప్రారంభంలో తమ ఇద్దరి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం ఉన్నా.. రాను రాను అది స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారిందని పేర్కొంది. దాంతో తామిద్దరూ వివాహం చేసుకున్నామని.. ప్రస్తుతం తమకు ఓ బిడ్డ ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ప్రసుత్తం వీరి వింత లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై నెటిజనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నా అని పిలిచిన తర్వాత.. అతడిపై నీకు ఫీలింగ్స్ ఎలా ఏర్పాడ్డాయి.. వావి వరసలు మరచిపోయి ప్రవర్తిస్తారా అని ట్రోల్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం.. కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంది. పైగా మీరు దూరపు బంధువులు.. నిజంగా మీ మధ్య అన్నాచెల్లెళ్ల రిలేషన్ లేదు కదా.. ఏం కాదు.. మీ జంట అద్భుతంగా ఉంది.. జీవితాంతం సంతోషంగా ఉండండి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వెరైటీ ప్రేమ కథ మీకు ఎలా అనిపించింది.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.