టాలెంట్ ఎవరి సొత్తు కాదు.. టాలెంట్ ఉన్నవారు ఎక్కడైనా నెగ్గుతారు అన్న సత్యం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ టాలెంట్ చూపిస్తు షభాష్ అనిపించుకుంటున్నారు. ఇక కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఏ పనైనా చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఫన్నీ వీడియోస్, ఎవరూ చేయని పనులు చేస్తూ ఎంత పాపులర్ అవుతుంటారో.. అంతే నెగిటివిటీని కూడా చూడాల్సి ఉంటుంది. ఓ మహిళ తన సృజనాత్మకతతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఓ వీడియో చేసింది.
ఇది చదవండి: కాజల్ సీరియస్! బాడీ షేమింగ్ ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్!
సాధారణంగా మనం ఏదైన చిప్స్ ప్యాకెట్ కొని తినేసిన తర్వాత కవర్‌ని ఎవరైన పడేస్తారు. కానీ ఈమె మాత్రం ఆ లేస్ ప్యాకెట్లతో ఏకంగా ఓ చీరనే తయారు చేసింది. వీడియోలో, అమ్మాయిమొదట నీలిరంగు బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్నుచూపుతుంది. తరువాత, ఆమె అనేక చిప్స్ ప్యాకెట్లతో తయారు చేసిన చీరను ధరించి ప్రత్యక్షమైంది. ఆ వీడియోకి క్యాప్షన్‌గా ‘నీలి రంగు లేస్ చీరల ప్రేమ కోసం అంటూ పెట్టింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు “చీరంటే ఇంటే ఇలా ఉండాలి” అని ఒకరు, ఇలాంటి వెర్రీ ఆలోచనలతో చీరల మీద విరక్తి తెప్పించకండి అని మరోకరు..ఇలా రకరకాలుగా ట్వీట్ చేశారు. కొందరు ప్యాకెట్లలో ఉండే జిడ్డును ఎలా తొలగించారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా లేస్ ప్యాకెట్లతో తయారు చేసిన దుస్తులు ధరించి ఉన్న ఫోటో, వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.