సాధారణంగా కొందరికి అభిమాన నాయకులతో కలవాలని, ఫోటో దిగాలనే కోరిక ఉంటుంది. ఇక ఏకంగా సీఎం మన ఇంటికే వస్తే మాములుగా మనం ఏం చేస్తాం.. మనం ఇష్టమైన రీతిలో వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు మహా అయితే కలిసి ఫోటో దిగేందుకు మాత్రం చూస్తాం. కానీ కర్ణాటకలో ఓ మహిళ మాత్రం సీఎం తన ఇంటికి రావటంతో ఏకంగా అతని చేయి పట్టుకుని ముద్దుల వర్షం కురిపించింది.
కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై గుట్టహళ్లిలో జనసేవక్ కార్యక్రమంలో పాల్గోనడానికి వచ్చారు. దీంతో అక్కడి ప్రాంతంలో జనసందోహంగా మారింది. దీంతో అక్కడికి వచ్చిన అభిమానుల్లో ఓ మహిళ సీఎం బసవరాజ బొమ్మై చేయి పట్టుకుని చేతిపై ముద్దుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఆ మహిళ చేసిన పనికి సీఎం కాస్త ఇబ్బందికి లోనయ్యారు. ఇక పక్కనున్న సెక్యూరిటీ, మంత్రులు ఆ మహిళను పక్కకు నెట్టేందుకు ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది. సీఎం హోదాలో ఉన్న బసవరాజ బొమ్మైపై ఉన్న గౌరవంతో ఇలా చేసిందే తప్పా ఇందులో తప్పపట్టటానికి ఏం లేదంటూ కొందరు స్పందిస్తున్నారు.