Heart: మానవ శరీరం అద్భుతాలకు నిలయం. నిజం చెప్పాలంటే మానవ శరీర నిర్మాణం, అవయవాల పని తీరు ఈ సృష్టిలో ఏ జంతువుకు లేని విధంగా ఉంటుంది. అందుకే మనిషి ఉన్నతమైన జీవిగా కీర్తించబడుతున్నాడు. అన్ని జంతువుల్ని శాసిస్తున్నాడు. అలాంటి అద్భుతమైన మానవ శరీరంలో గుండె ప్రధానమైన అవయవం. గుండె నిరంతరం కొట్టుకుంటూ, మనిషి ప్రాణాలతో ఉండేలా చేస్తుంది. అలాంటి గుండె కొన్ని నిమిషాలు ఆగిపోయిందంటే ప్రాణం పోయినట్లే లెక్క. అయితే, ఓ మహిళ విషయంలో ఈ లెక్క తప్పింది. వైద్య శాస్త్రమే నోరెళ్లబెట్టే అత్యంత అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మహిళ గుండె ఏకంగా మూడు గంటలకుపైగా ఆగిపోయింది.
అయినా ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, కంకర్ ఖేడా జిల్లాకు చెందిన 34 ఏళ్ల కవిత గత రెండు ఏళ్లుగా ఛాతి నొప్పితో బాధపడుతోంది. ఆమె పల్స్ రేట్ కూడా పెరిగిపోయింది. తాజాగా, కవిత భర్త రాజుతో కలిసి వైద్యులను సంప్రదించింది. పరీక్షలు చేసిన వైద్యులు కవిత గుండె కవాటము పాడైనట్లు తేల్చారు. వెంటనే ఆపరేషన్ చేసి కవాటాన్ని మార్చాలని చెప్పారు. ఆపరేషన్‌కు ఏర్పాట్లు జరిగిపోయాయి. డాక్టర్లు ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఆపరేషన్ సమయంలో ఆమె గుండె కొట్టుకోవటం ఆగిపోయింది.
దీంతో కృత్రిమంగా మిషిన్ సహాయంతో హృదయ స్పందనలను కలుగజేశారు. డాక్టర్ రోహిత్ చౌహాన్ బృందం మూడు గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించింది. ఈ మూడు గంటలు ఆమె గుండె మాత్రం కొట్టుకోలేదు. ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ, డాక్టర్లకు ఓ అనుమానం వచ్చింది. ఇన్ని గంటలు ఆమె గుండె కొట్టుకోలేదు కదా? ఆమె బతుకుతుందా? అని. కానీ, డాక్టర్ల అనుమానాలను తుడిచేస్తూ కవిత కళ్లు తెరిచింది. కొద్దికొద్దిగా కోలుకుంటోంది. మరి, మూడు గంటలకు పైగా గుండె ఆగిపోయినా.. బతికిన ఈ మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: మీకు ఆటోమేటిక్ కారు ఉందా? ఈ తప్పు అస్సలు చేయద్దు.. కళ్ల ముందే ప్రాణం పోయింది!