Viral Video: ఈ మధ్య కాలంలో ఉత్తర భారత దేశంలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. కొంతమంది విచ్చల విడిగా తుపాకుల్ని వాడుతున్నారు. బహిరంగంగానే వాటిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఏవైనా వేడుకలు జరిగినపుడు గన్‌తో కనిపించటం మామూలైపోయింది. గాల్లోకి కాల్పులు జరపటం కూడా సాధారణ విషయంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే కొన్ని మరణాలు కూడా సంభవించాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా కూడా జనం మారటం లేదు. ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, ఓ యువతి గన్‌తో స్టేజిపై డ్యాన్స్ చేసింది.
గన్‌ను అటు ఇటు స్టైల్‌గా తిప్పుతూ స్టెప్పులేసింది. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం బిహార్‌లోని శివాన్ సిటీలో ఓ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేయటానికి ఓ యువతిని పిలిపించారు. రాత్రి పూట ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది. రెడ్ డ్రెస్‌లో ఉన్న అమ్మాయి స్టేజిపై డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇంతలో ఓ యువకుడు స్టేజిపైకి వచ్చాడు. అతడి చేతిలో ఓ తుపాకి ఉంది. స్టేజిపైకి రాగానే అతడు ఆ యువతకి తన చేతిలోని తుపాకిని అందించాడు. ఆమె ఏ మాత్రం భయపడకుండా తుపాకిని చేతుల్లోకి తీసుకుంది.
యువతికి తుపాకి ఇచ్చిన తర్వాత ఆ యువకుడు ఆమెకు కొంత డబ్బులు కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఆ డబ్బులు తీసుకోలేదు. తన పాటికి తాను తుపాకితో డ్యాన్స్ చేయసాగింది. ‘‘హమ్ బిహారి’’ అనే పాటకు చేతిలో తుపాకితో మాస్ డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం సదరు యువతి తుపాకితో డ్యాన్స్ చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఆయుధాల చట్టం 2019 ప్రకారం లైసెన్స్ కలిగిన ఆయుధాలతో ఫంక్షన్లలో ఫైరింగ్ చేయటం నేరం. ఇందుకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడుతుంది.
डांसर के हाथों में पिस्टल थमा कर युवक मस्ती में ऐसे डांस कर रहा हैं, जैसे इसको पुलिस प्रशासन का खौफ ही नहीं… VIDEO सीवान का है… @BJP4Bihar pic.twitter.com/0ucjXesl8T
— Nitesh Srivastava (@nitesh_sriv) September 30, 2022
ఇవి కూడా చదవండి : Viral Video: వీడియో: అమ్మాయిల ముందు అతి చేశాడు.. నవ్వుల పాలయ్యాడు!