మళ్లీ వెనక్కు లాక్కువచ్చి మరీ పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ రెండేళ్ల..
పెళ్లంటే ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు చూడాలంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముందున్న విలువలు, సంప్రదాయాల పాటింపు కూడా లేదు. నేడు.. అమ్మాయి వైపు కుటుంబసభ్యులు, అబ్బాయి వైపు కుటుంబసభ్యులు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా..ఎవరు పెళ్లికి వచ్చినా, రాకపోయినా పట్టించుకోకుండా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. ఆడ కావచ్చు.. మగ కావచ్చు.. ఇష్టం వస్తే ఎంతవరకైనా వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారు. ఇందుకు తాజా ఘటనే ఉదాహరణ. ఓ మహిళ తనను కాదని పారిపోయిన ఓ పెళ్లి కుమారుడ్ని వెతికి మరీ పట్టుకుంది.
అతడితో మూడు ముళ్లు వేయించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ రెండేళ్ల నుండి సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసిపోయింది. దీంతో వారికి పెళ్లి చేయడానికి ఓ మంచి ముహూర్తం నిర్ణయించారు. మే 21న భూతేశ్వర్ నాథ్ ఆలయంలో వివాహానికి ముహూర్తం ఖరారయ్యింది. పెళ్లి రోజు రానే వచ్చింది.
పెళ్లి కుమార్తె పెళ్లి పీటలపై కూర్చుని ఉంది. గంటలు గడుస్తున్నా.. పెళ్లికొడుకు మండపానికి రాలేదు. పెళ్లికూతురు అతనికి ఫోన్ చేసింది. తాను తన తల్లిని తీసుకురావడానికి బుదౌన్ కు వెళ్తున్నట్లు అతడు చెప్పాడు. పెళ్లికూతురు అనుమానంతో అతనిని వెంబడించి బరేలీకి 20కి.మీ దూరంలో అతనిని పట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరి కుటుంబసభ్యులు భీమోర ఆలయంలో వివాహం జరిపించారు. పెళ్లికి ముందు జరిగిన హై డ్రామా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.