సాధారణంగా భూగ్రహం మీద భూమి పరిణామం కంటే నీటి పరిణామం ఎక్కువగా ఉంది. అందులోనూ సముద్రాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఇలాంటి సముద్రం గర్భం ఎన్నో అద్భుతమైన, విచిత్రమైన జీవరాశిని కలిగి ఉంటుంది. వింత వింత చేపలు, ఇతర జీవులు ఉంటాయి. వీటిని మనం నేరుగా చూడలేం. జియోగ్రాఫిక్ చానల్స్ ఇతర యూట్యూబ్స్ లో చూడగలం. తాజాగా సముద్రంలో ఉండే కొన్ని విచిత్రమైన, అద్భుతమైన జీవులకు సంబంధించిన ఓ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అనేక జీవజాతులు మహాసముద్రాల్లో అట్టడుగున జీవిస్తూ సైన్స్ కు అందని రీతిలో విస్మయం కలిగిస్తున్నాయి. తాజాగా సముద్ర గర్భంలో కొన్ని జీవులకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతుంది. అందులో కనిపించే ఒక్కొక్క జీవి ఓ ప్రత్యేకతను కలిగి ఉంది. మనిషిలాగా ముఖ కవలికలు ప్రదర్శించే జీవి, అరచేతిలో గాజు బొమ్మలా ఇమిడిపోయే మరో జీవి, రెండు తలల తాబేలు ఆకట్టుకుంటున్నాయి. అయితే సముద్రపు ఆవు మనోహరమైన వెంట్రుకలను కలిగి ఉంది. ఇలా ఎన్నో అద్భుతమైన, విచిత్రమైన ఈ జీవులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మీరు ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.