Viral Video: ‘‘ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు’’ .. తల్లుల గురించి కేజీఎఫ్ సినిమాలో హీరో చెప్పే డైలాగ్ ఇది. ఇది సినిమాలో డైలాగే అయినా వాస్తవానికి అక్షర సత్యం. బిడ్డను కాపాడుకోవటంలో తల్లిని మించిన వారు ఎవరూలేరు. బిడ్డ ప్రాణాల మీదకు వస్తే ఏ తల్లీ చూస్తూ ఉరుకోదు. తన ప్రాణాలకు తెగించైనా.. ప్రాణాలు అర్పించైనా బిడ్డను కాపాడుకుంటుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో. ఓ తల్లి రోడ్డు ప్రమాద సమయంలో తన బిడ్డను ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకుంది. వివరాల్లోకి వెళితే.. వియత్నాం, నామ్ డిహ్‌లోని గాయ్‌కి చెందిన ఓ వ్యక్తి భార్య, బిడ్డతో కలిసి హైవేపై బైక్‌లో వెళుతున్నాడు. బైక్‌కు వెనకాల మొత్తం డబ్బాలు కట్టి ఉన్నాయి. కొంత దూరం పోగానే ఓ కారు వచ్చి ఆ డబ్బాలను తగిలింది. దీంతో బైక్ ఒక్కసారిగా అదుపు తప్పింది. వెనకాల కూర్చున్న తల్లీ,బిడ్డ కిందపడి సర్రున జారారు.
సరిగ్గా ఆటైంలోనే ఎదురుగా వస్తున్న ట్రక్ చక్రాల పక్కన పడ్డారు. కొంచెం ఉంటే ఆ బిడ్డ ట్రక్ చక్రాల కిందపడేవాడే. బిడ్డకు ప్రమాదం జరుగుతుందని గ్రహించిన తల్లి వెంటనే బిడ్డను ఒళ్లోకి తీసుకుని పక్కకు దొర్లింది. క్షణ కాలం.. సెంటీ మీటరు దూరంతో పెను ప్రమాదం తప్పింది. బైక్‌పై ఉన్న ఆమె భర్త బైకు కింద పడకుండా నిలదొక్కుకున్నాడు. పెను ప్రమాదం నుంచి కుటుంబం మొత్తం సేఫ్‌గా బయటపడింది. 2019లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 25వ తేదీన ప్రముఖ ఇంగ్లాండ్ క్రికేటర్ జఫ్రా ఆర్చర్ ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mother of the year https://t.co/qIZlz1PYEZ
— Jofra Archer (@JofraArcher) April 25, 2022
ఇవి కూడా చదవండి : నానో కారును హెలికాప్టర్ గా మార్చిన వ్యక్తి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.