Viral Video: ఈ మధ్య కాలంలో ఫోన్ అనేది నిత్యావసరం మాత్రమే కాదు.. అత్యావసరంగా కూడా మారిపోయింది. కొంతమంది ఫోన్‌కు ఓ రెండు నిమిషాలు దూరంగా ఉంటేనే గిలగిల్లాడిపోతుంటారు. మనుషులతో మాట్లాడకపోయినా ఉంటారు కానీ, ఫోన్ చూడకుండా.. మాట్లాడకుండా మాత్రం ఉండలేరు. అలాంటిది ఫోన్‌ను ఎవరైనా దొంగిలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. ఊహించలేము కదూ.. అందుకే తన ఫోన్‌ను దొంగ లాక్కుపోతుంటే ఓ మహిళ ఎదురు తిరిగింది. దాన్ని అతడు లాక్కుపోకుండా ఓ చిన్న పాటి యుద్ధమే చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన ఓ యువతి సెప్టెంబర్ 4వ తేదీన తాజ్ పురి పహారిలోని తన స్నేహితురాలిని కలిసి ఇంటికి తిరిగి వెళుతోంది.
చేతిలో ఫోన్ పట్టుకుని రోడ్డుపై నడుస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఓ దొంగ ఆమె వెనకాలే చిన్నగా నడుచుకుంటూ వచ్చాడు. ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని పారిపోవటానికి చూశాడు. అయితే, ఆమె ఫోన్‌ను గట్టిగా పట్టుకోవటంతో అతడి ప్రయత్నం విఫలమైంది. అయినా కూడా అతడు అక్కడినుంచి పారిపోలేదు. ఫోన్‌ను ఆమెనుంచి లాక్కోవటానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ వదల్లేదు. కొద్ది సేపటి తర్వాత ఫోన్ కిందపడిపోయింది.
ఆ దొంగ ఫోన్ తీసుకోకుండానే అక్కడినుంచి పారిపోయాడు. రాత్రి 11గంటల సమయంలో పోలీసులకు దీనిపై సమాచారం అందింది. వాళ్లు అక్కడికి వెళ్లే సమయానికే దొంగ పరిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. యువతి ధైర్యానికి ముచ్చటపడిపోతున్నారు. అలాంటి యువతులే దేశానికి గర్వకారణమని ప్రశంసిస్తున్నారు. మరి, దొంగ తన ఫోన్ లాక్కుపోవటాన్ని ధైర్యంగా అడ్డుకున్న యువతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
दिल्ली में बेख़ौफ़ बदमाश, बदरपुर इलाके में 4 सितंबर को स्नैचिंग के दौरान बदमाश ने लड़की पर हमला किया,केस दर्ज,आरोपी की तलाश जारी है pic.twitter.com/J3ymciRW8X
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) September 8, 2022
ఇవి కూడా చదవండి : Snake: పామును కొరికి చంపి.. మెడలో వేసుకుని చక్కర్లు..