viral video : ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. అన్నట్లు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక్క క్షణంలో జీవితంలో ఎలాంటి మార్పులైనా చోటుచేసుకోవచ్చు.. మన ప్రాణాలు కూడా పోవచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. సిగరెట్ తాగుతూ తన షాపు బయటకు వచ్చిన ఓ వ్యక్తికి జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురైంది. ప్రాణం పోలేదు కానీ, చావు తప్పి కన్ను లొట్టపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. టర్కీలోని కడోకోయ్‌కి చెందిన ఓమర్ కచ్చేగాన్ అనే వ్యక్తికి ఓ షాపు ఉంది. ఫిబ్రవరి 4వ తేదీన షాపులో సిగరెట్ అంటించుకుని, ఫోన్‌లో మాట్లాడుతూ బయటకు వచ్చాడు. నడుచుకుంటూ అక్కడ ఉన్న వెండింగ్ మిసిన్ దగ్గరకు వెళుతుండగా ఒక్కసారిగా భూమి లోపలికి కుంగిపోయింది.
దాదాపు 20 అడుగుల గుంత ఏర్పడింది. ఒమర్ అందులో పడిపోయాడు. వెండింగ్ మిషన్లలో ఓ మిషన్ అతడిపై పడింది. అయితే, ఇంత జరిగినా అతడికి ఏమీ కాలేదు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది 25 నిమిషాల్లోనే అతడ్ని బయటకు తీసుకువచ్చారు. భూమి కుంగిన ప్రదేశంలో ఇది వరకు ఓ బావి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నువ్వు అదృష్టవంతుడివి బ్రో.. పొగతాగటం ఆరోగ్యానికి హానికరం.. ఇది చెప్పటానికే భూమి కుంగిపోయింది.. మన చివరి అడుగు ఏది అని ఎవ్వరూ చెప్పలేరు.. గోతిలో పడితే పడ్డాడు కానీ, తినటానికి, తాగటానికి గుంతలో చాలా దొరికాయి..’’ అంటూ కొంతమంది సీరియస్‌గా.. మరికొంతమంది ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.