Snake Rescued: ఒంటికి తారు అంటుకుని అల్లాడిపోతున్న నాగుపాముకు వైద్యులు విముక్తి కలిగించారు. దానికి వంట నూనెతో చికత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన ఒరిస్సాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సాలోని పూరి జిల్లా, డెలంగాకు చెందిన ఓ వ్యక్తికి సిమెంట్ బస్తాల గోడౌన్ ఉంది. అక్కడ ఓ చోట నేల మీద కొంత తారు పడి ఉంది. గోడౌన్‌లోకి వచ్చిన పాము తారు మీదనుంచి వెళ్లటంతో ఒంటికి మొత్తం తారు అంటుకుంది. ఇక పాము కదల్లేని పరిస్థితిలో తారులోనే ఉండి పోయింది. పని మీద గోడౌన్‌లోకి వెళ్లిన యజమాని తారులో పడిఉన్న పామును చూశాడు. వెంటనే పాములను రక్షించేవారికి సమాచారం అందించాడు.
అక్కడికి వచ్చిన వాళ్లు పామును తారునుంచి బయటకు తీశారు. అయితే, పామునుంచి తారును వేరు చేయలేకపోయారు. దీంతో దాన్ని ఓ న్యూస్ పేపర్లో చుట్టి, వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్ ఇంద్రమని నాథ్ బృందం ఎంతో శ్రమ కోడ్చి తారును వేరు చేసింది. సన్ ఫ్లవర్ ఆయిల్‌తో చికిత్స చేసి పామును రక్షించింది. ఇందుకోసం దాదాపు 90 నిమిషాల పాటు కష్టపడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పామును ఎంతో చాకచక్యంగా కాపాడిన వైద్యులు, స్నేక్ రెస్క్యూ సిబ్బందిని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: వరుడి మెడలో డబ్బుల దండ.. షాకిచ్చిన స్నేహితుడు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.