కచ్చా బాదాం పాట తెలియని వారంటూ ఉండరు. పాట అర్థం తెలియకపోయినా, భాష అర్థం కాకపోయినా అందరి నోటా కచ్చా బాదం అన్న మాట నానుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్ తలరాతని మార్చి, ఇప్పుడు అందరినీ ఒక ఊపు ఊపేస్తోంది. పల్లీలు అమ్ముకునే ఓ సాధారణ వ్యాపారి గొంతుకుకి ప్రపంచం అంతా దాసోహం అయ్యింది. ఆ పాటతో భుబన్ కు పెరిగిన ఫ్యాన్ పాలోయింగ్ చూశాం. ఇన్‌స్టాలో ఎక్కడ చూసినా ఈ బెంగాలీ పాటపై రీల్సే కనిపిస్తున్నాయి. సామాన్యల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ పాటకు స్టెప్పులేసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, తాజాగా పోలీస్ యూనిఫాంలో కొందరు ఈ పాటపై స్టెప్పులేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో.. ఓ మహిళ పోలీస్ అధికారి తన తోటి నలుగురు పోలీసులతో కలసి కచ్చాబాదం పాటకు డ్యాన్స్ వేశారు. ఈ పాటకు మహిళ పోలీస్ వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టున్నాయి. మిగిలిన నలుగురు పోలీసులు ఆమెను చూస్తూ ఉండి పోయారు. ఈ వీడియోపై నెటిజన్లు నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ వీడియోలో డ్యాన్స్ వేసింది నిజంగా పోలీసులా? కాదా?అనేది క్లారిటీ లేదు. ఈ వీడియోను కొచ్చిలోని హోటల్ డ్యూలాండ్ ఎంట్రన్స్ వద్ద షూట్ చేశారు. అయితే వీరు వేసిన కచ్చాబాదం స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Why shouldn’t khaki have some fun. Watch out on left and right most. pic.twitter.com/izKTzrq0Sm
— Da_Lying_Lama🇮🇳 (@GoofyOlives) March 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.