Viral Video: పెళ్లి వేడుకల్లో చోటుచేసుకుంటున్న వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కొత్త జంటకు సిల్లీ గిఫ్టులు ఇవ్వటం.. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు కొట్టడం.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుపై అలగటం ఇలా చాలా వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా, పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న ఓ ఘటన ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను చూస్తున్న జనం పగలబడి నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. పెళ్లి వేడుకలో వధువు వరుడి మెడలో పూలదండ వేస్తుంది. ఆ వెంటనే వరుడు కూడా వధువు మెడలో పూలదండ వేశాడు.
ఈ సమయంలో అతడి ప్యాంట్స్ మెల్లగా కిందకు జారిపోయింది. మొదట అతడు ఆ విషయాన్ని గమనించలేదు. కొద్దిసేపు అలానే ఉన్నాడు. ‘ఇదేదో తేడాగా ఉందే’ అనిపించినట్లుంది. వెంటనే కిందకు చూసుకున్నాడు. ప్యాంట్స్ కిందకు జారిపోయి ఉంది. ఇక ఆలస్యం చేయకుండా దాన్ని పైకి లాక్కోవటం మొదలుపెట్టాడు. ప్యాంట్స్ ఊడిపోవటం చూసిన వధువు పగలబడి నవ్వటం మొదలుపెట్టింది. వరుడు కూడా చేసేదేమీ లేక ఆమెతో పాటు నవ్వటం ప్రారంభించాడు. భుత్నికే మీమ్స్ అనే ఖాతాదారుడు ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియో 916 లైక్స్‌ను సొంతం చేసుకుంది.
దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఓ పెళ్లి కొడుకా.. ప్యాంట్స్‌ను అలా లూజుగా వదిలేస్తే ఎలా?..’’.. ‘‘పోయింది.. పెళ్లి కూతురు ముందు పరువు మొత్తం పోయింది’’.. ‘‘ ఏయిర్ ఫ్రీ ఫ్యాంట్స్ అంటే ఇలాగే ఉంటుంది మరి!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు. సోషల్ మీడియాలో పాత వీడియోలు సైతం కొత్తగా వైరల్ అవుతున్న సంగతి గమనార్హం. ఈ వీడియో కూడా పాత వీడియో అయిఉండే అవకాశం కూడా ఉంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Italy: 76 ఏళ్ళ బామ్మతో ప్రేమలో పడ్డ 19 ఏళ్ల టీనేజర్! కారణం?