పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో పండుగ లాంటిదే. ఈ వేడుకలో పెళ్ళికొడుకు, పెళ్లి కుమార్తె బిజీగా ఉండటం సహజం. చుట్టూ బంధులువులు, స్నేహితులు.. గోలలు.. ఈలలు అబ్బో చాలా సందడిగా ఉంటుంది. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? అవునండీ బాబు.. ఇంత ఆడంబరంగా జరిగే పెళ్ళిలో.. వరుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా.. పక్కనే ఉన్న స్నేహితుడు అనుకోని విధంగా షాకిచ్చాడు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వీడియోలో వరుడు మెడలో డబ్బుల దండతో కనపడుతున్నాడు. పెండ్లి వేదికపై కూర్చున్న పెండ్లికొడుకు బంధువులు చెప్పేది వింటున్నాడు. ఇంతలో అతడికి దగ్గరగా కుర్చీలో కూర్చొన్న స్నేహితుడు చోరీకి ప్రయత్నించాడు. పెళ్ళికొడుకు ఒకసారి తలతిప్పగా ఆ వ్యక్తి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అయితే.. వరుడు పెండ్లి తంతులో బిజీ కాగా అతడి మెడలో ఉన్న డబ్బుల దండ నుంచి కొన్ని నోట్లు కొట్టేసిన స్నేహితుడు మెల్లగా తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు.
ఈ తతంగాన్ని.. అక్కడే ఉన్న ఒకరు తన మొబైల్‌లో రికార్డు చేసి పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చుసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. డబ్బులను చూస్తే ఎవరికైనా ఆశ పుడుతుందని ఒకరు, ఇది కూడా వ్యాపారమని మరొకరు కామెంట్ చేశారు.
ఇది కూడా చదవండి: కారు ప్రమాదంతో నా కళ్లు తెరుచుకున్నాయి: కచ్చా బాదామ్ ఫేమ్!