రాబోయేది రోబోల యుగం. వాటితో పోటీ పడి పనిచేసే తరుణం ఆసన్నమైంది. అందుకు తగ్గట్లుగా నైపుణ్యాలు మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. చాలా పనులను చేయడానికి రోబోలను ఉపయోగిస్తున్నారు. వయసుమీరిన వారికి సాయం చేయడానికి, ఇంట్లో పలు రకాలైన పనులను చేయడానికి రోబోలను ఉపయోగిస్తున్నారు. చెఫ్ ల రోబోలూ ఉన్నాయీ. స్పెయిన్‌లో పయోల్లా అనేది రైస్‌తో చేసే వంటకం. అక్కడి ప్రజలు దీన్న ఇష్టంగా తింటారు. ఇది అక్కడి జాతీయ వంటకం. అయితే, ఇది ప్రిపేర్ చేయడానికి ఏకంగా ఒక రోబోనే ఏర్పాటు చేసుకున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రోబోను స్పెయిన్‌లోని బీఆర్5, మీమ్ కుక్ సంస్థలు తయారు చేశాయి. ప్రస్తుతం ఈ రోబో చేయి తిరిగిన చెఫ్‌లా పయోల్లాలు వండేస్తుంది. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ రోబోలో ప్రోగ్రామింగ్ ఇన్‌స్టాల్ చేశారు. దీంతో అది ఎంత క్వాoటిటీ పయోల్లా కావాలి తదితర వివరాలు ప్రోగ్రామింగ్ సిద్ధం చేశారు. ఏ పదార్థం ఎంతసేపు వండాలి, ఎలా కలపాలి, ఆపాలి ఇలా అన్నీ ప్రోగ్రామింగ్‌లో సిద్ధం చేస్తారు.
స్టవ్ మంట ఎప్పుడు హైలో ఉండాలి, ఎప్పుడు లో ఉండాలి. కలిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అన్నీ ప్రోగ్రామింగ్‌లో ఉంటాయి. దాని వల్ల ఎన్నిసార్లు చేసినా ఒకటే టేస్ట్ వస్తుందట. ఈ రోబో పనితనం మెచ్చిన రిసార్ట్స్ వాళ్లు తమకు కూడా కావాలంటూ ఆర్డర్లు పెడుతున్నారట. ప్రపంచ వ్యాప్తంగా స్పెయిన్ ఫేవరెట్ వంటకాలను అదే రుచితో తయారు చేసేలా ఈ రోబోను రూపొందించినట్లు రోబో తయారీ సంస్థ బీఆర్5 చెబుతోంది. ఈ రోబోకు అలుపు ఉండదు కాబట్టి… ఎంతమంది వచ్చి పయెల్లాలు అడిగినా వెంటనే చేసి అందిస్తోంది.