Viral News : సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు కచ్చా బాదామ్ పాట ఏ రేంజ్‌లో పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో చూసిన ఈ పాట హవా అంతాఇంతా కాదు. దానికి తోడు సెలబ్రిటీలు సైతం ఈ పాటకు స్టెప్పులు వేయటం మరింత క్రేజీగా మారుతోంది. ప్రతీ రోజు ఎవరో ఒక సెలబ్రిటీ ఈ పాటకు డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. తాజాగా బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కచ్చా బాదామ్ పాటకు డ్యాన్స్ వేశారు. పసుపు రంగు సల్వార్ సూట్‌లో ఆమె ఎంతో అందంగా స్టెప్పులు వేశారు. కచ్చా బాదామ్‌లోని సిగ్నేచర్ స్టెప్పులు కూడా వేశారు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం సింధు డ్యాన్స్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. అప్‌లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల సంఖ్యలో వ్యూస్,లైక్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్‌లో ఉంది.
కాగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పల్లీల వ్యాపారి భుబన్ బద్యాకర్ తన వ్యాపారాన్ని ప్రమోట్ చేయటానికి ఈ పాటను రాశారు. సైకిల్‌పై ఊరు ఊరు తిరుగుతూ.. ‘కచ్చా బాదామ్’ పాటను పాడుతూ పల్లీలు అమ్మేవాడు. అతడు ఊహించని విధంగా పాట సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం.. అతడు రాత్రికి రాత్రికి స్టార్ అవ్వటం జరిగిపోయాయి. గతంలో రోజుకు 250 రూపాయలు సంపాదించే వాడు.. ఇప్పుడు అంతకు వంద రెట్లు ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఆ సంపాదించిన డబ్బుతో ఏకంగా ఓ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొన్నాడు. కారు నడపటం రాక యాక్సిడెంట్ కూడా చేసుకున్నాడు. సింధు కచ్చా బాదామ్ డ్యాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.