ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లు పుట్టుకతోనే చాలా ప్రత్యేకమైన వారు. ఒకేలా ఉండటమే కాదు.. చేసే పనులు కూడా ఒకేలా ఉండేవి. అలాంటి వారు ప్రేమ, పెళ్లి విషయంలోనూ ఒకేలా ఆలోచించారు.. దాన్నే ఆచరణలో పెట్టారు. ప్రపంచం మొత్తం వారి వైపు తిరిగిచూసేలా చేసుకున్నారు. ఒకే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వార్తల్లో నిలిచిపోయారు. ఇంతకీ అసలు సంగతేంటంటే.. ఈస్ట్ కాంగోకు చెందిన నడేగే, నటాషా, నటాలీ కవల పిల్లలు. ఈ ముగ్గురు యువతులు నిమిషాల తేడాతో జన్మించారు. ఇలా ఒకే కాన్పులో ముగ్గురు జన్మించటాన్ని ట్రిప్లెట్స్ అంటారు. అందుకే వీరి పేర్లు కూడా ఒకే విధంగా ఉండేలా పెట్టారు పెద్దలు. వీరికి చిన్నప్పటినుంచి ఒకేలా ఉంటం ఇష్టం. అది వేసుకునే దుస్తులు కావచ్చు, అలంకరణ కావచ్చు, ఆడుకునే బొమ్మలు కావచ్చు.. అన్నీ ఒకే విధంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ముగ్గురు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
ఓ రోజు నటాషా, లువిజో అనే 32 ఏళ్ల యువకుడి ఇంటికి తీసుకువచ్చింది. అతడ్ని ఇద్దరు చెల్లెల్లకు పరిచయం చేసింది. తాను, లువిజోను ప్రేమిస్తున్నానని కూడా చెప్పింది. ఆ తర్వాతినుంచి ఆ ఇద్దరు చెల్లెళ్లు కూడా లువిజోతో క్లోజ్‌గా ఉండేవారు. వారికి కూడా లువిజోపై ప్రేమ పుట్టింది. వారు తమ ప్రేమ విషయాన్ని అక్కకు చెప్పారు. నటాషా మొదట్లో బాధపడ్డా తర్వాత వారి ప్రేమను అంగీకరించింది. ఓ రోజు ముగ్గురు కలిసి లువిజోకు ప్రపోజ్ చేశారు. తమను పెళ్లి చేసుకోవాలని కోరారు. లువిజో షాక్ అయ్యాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అక్కాచెల్లెళ్లు అతడ్ని ఎంత ప్రేమిస్తున్నారో అర్థం అయ్యేలా చెప్పారు.
దీంతో అతడు ముగ్గుర్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. అయితే, వీరి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోలేదు. కానీ, లువిజో పట్టు వీడలేదు. చివరకు పెద్దల అనుమతి లేకుండానే ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు. నటాషా, నడేగే, నటాలీ మాట్లాడుతూ.. ‘‘ మాకు చిన్నప్పటినుంచి ప్రతీ వస్తువును షేర్ చేసుకోవటం అలవాటు. భర్తను కూడా మేము సమానంగా షేర్ చేసుకుంటాం. భర్త విషయంలో గొడవలు పడం. సర్దుకుపోవడం మాకు బాగా అలవాటైంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ పెళ్లి ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.