మ్యాజిక్ షో లు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. మ్యాజిక్ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగిన జనాలు ఆసక్తిగా చూస్తుంటారు. ఆ షోలో వారు చేసే ట్రిక్స్ చూస్తే మజాగా ఉంటుంది. అందులోనూ పావురాళ్లను షర్ట్ లో నుంచి తీయడం.. ఒక మనిషిని మాయం చేసి మరో మనిషిని ప్రత్యక్షం చేయడం చాలా బాగుంటుంది. ఇలాంటి మ్యాజిక్ చిన్నారులు చేస్తే ఎలా ఉంటుంది? ఓ పాప గుడ్డుతో మ్యాజిక్ చేసింది. ఆ పాప చేసిన మ్యాజిక్ షోకు అక్కడున్నవాళ్లను షాక్‌తో పాటు షేక్ చేసింది.
మ్యాజిక్ ఎవరు చేసిన చాలా ఆశ్చరంగా ఉంటాయి. కానీ చిన్నారు చేస్తే మరింత ఆశ్చర్యానికి లోనవుతాము. అలానే ఓచిన్నారి చేసిన మ్యాజిక్ అందరిని ఆకట్టుుకుంది. ఎలా అంటే..ఆ చిన్నారి టేబుల్‌పై క్లాత్ వేసి.. 3 గుడ్లను దానిపై ఉంచింది. ఆమె చుట్టూ పిల్లలు, పెద్దవాళ్లూ ఉన్నారు. ఆ తర్వాత రెండు గిన్నెలు తీసుకుని.. వాటిలో ఓ గిన్నెను బోర్లించి… అందులో ఓ గుడ్డును పెట్టినట్లు చూపించింది. మరో గిన్నెను మరో గుడ్డుపైన ఉంచింది. మూడో గుడ్డు ఖాళీగా ఉంది. తన చేతుల్లో ఏమీ లేదన్న పాప… రెండు గిన్నెల కిందా రెండు గుడ్లు ఉన్నాయని చెప్పింది. ఆ వెంటనే మూడో గుడ్డును చేతిలోకి తీసుకొని మాయం చేసింది.
ఇప్పుడా ఎగ్ ఎక్కడుందో చెప్పమని తోటి పిల్లల్ని అడిగింది. ఒకరేమో ఓ గిన్నెను చూపించారు. మరొకరు మరో గిన్నె కింద ఉంది అన్నారు. కానీ ఆ రెండు గిన్నెల కింద మూడో గుడ్డు కనిపించలేదు. క్షణాల్లో మాయ చేసిన పాప… మళ్లీ గిన్నెలు తెరవగా ఒక దాంట్లో రెండు ఇంకోదంట్లో ఒక గుడ్డు కనిపించింది. ఈ ట్రిక్ చూసినవాళ్లంతా షాక్ కి లోనయ్యారు. మరి.. ఈ చిన్నారిపై మీ అభిప్రాయలాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.