Venkaiah Naidu : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడులో మంచి హాస్య చతురుత ఉందన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన మాటలతో అందర్నీ నవ్విస్తూ ఉంటారు. తాజాగా, రాజ్యసభలో ఆయన అడిగిన ప్రశ్న అక్కడి వారందర్నీ తెగ నవ్వించేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే… నిన్న రాజ్యసభ సమావేశాల సందర్భంగా సభ్యులు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రముఖ మళయాల హీరో సురేష్ గోపీ వంతు వచ్చింది. ఆయన పైకి లేచి మాట్లాడబోయారు. సురేష్ గోపీ ముఖం వంక తీక్షణంగా చూస్తున్న ఉప రాష్ట్రపతికి ఆయన ధరించింది మాస్కా?.. లేక గడ్డమా అన్నది అర్థం కాలేదు.
అదేంటో తెలుసుకోకుండా ఉండలేకపోయారు. వెంటనే ‘‘ అది మాస్కా.. లేక గడ్డమా’’ అంటూ సురేష్ గోపీ గడ్డాన్ని ఉద్ధేశిస్తూ సెటైరిక్‌గా ప్రశ్నించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఆ వెంటనే సురేష్ గోపీ సమాధానం ఇస్తూ ‘‘ గడ్డమే సార్.. ఇది నా కొత్త లుక్’’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ది హిందూ పత్రిక సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ మహ్మద్ ఇమ్రానుల్లా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
A lighter moment in the Rajya Sabha pic.twitter.com/lQH5g0wO4U
— Mohamed Imranullah S (@imranhindu) March 27, 2022
ఇవి కూడా చదవండి : చెప్పినా వినలేదు.. కూతురు శవాన్ని భుజంపై వేసుకుని వెళ్లిపోయాడు..