Viral Video: ఈ మధ్య అబ్బాయిల కోసం అమ్మాయిలు కొట్టుకోవటం ఎక్కువైపోయింది. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు తరచుగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శన మిస్తూనే ఉన్నాయి. తాజాగా, ఓ అబ్బాయి కోసం కొంతమంది యువతులు కొట్టుకున్నారు. పిడి గుద్దులు కురిపించుకున్నారు.. కర్రతో కొట్టుకున్నారు. వీధిలోనే రచ్చరచ్చ చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఉత్తరాఖండ్, హల్ద్‌వానీ, హీరా నగర్ చౌకీలోని పులిసా యోగా పార్క్‌లో ఓ ఇద్దరు యువతులు ఓ యువకుడి కోసం కొట్టుకున్నారు. ఆ ఇద్దరు యువతులు ఆ యువకుడ్ని ప్రేమిస్తుండటంతో ఈ గొడవ మొదలైంది. మొదట ఆ ఇద్దరు యువతులు తమ స్నేహితురాళ్లతో వీధిలోకి వచ్చి తిట్టుకున్నారు. తర్వాత ఆ గొడవ పెద్దదయింది. ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకోవటం మొదలుపెట్టారు. ఇంతలో ఎవరో వారి వైపు ఓ కర్రను విసిరారు. ఆ వెంటనే ఆ కర్రతో కూడా కొట్టుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘గత జన్మలో ఆ యువకుడు ఆ ఇద్దరు అమ్మాయిల వల్ల చనిపోయి ఉంటాడు. అందుకే ఈ జన్మలో ఇలా కక్ష తీర్చుకుంటున్నాడు’.. ‘ఇదేం ఫైట్ రా బాబు! వీధి రౌడీలు కూడా ఇంత దారుణంగా కొట్టుకోరు’.. ‘ అమ్మాయిలకు స్వాతంత్రం వచ్చిందనటానికి ఇదే నిదర్శనం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
एक ब्वॉयफ्रेंड के लिए सड़क पर भिंड़ी दो लड़कियां, बाल पकड़कर घसीटा, फिर डंडों की बरसात, देखें VIDEO
हल्द्वानी के हीरा नगर चौकी क्षेत्र के पुलिस योगा पार्क में एक प्रेमी को लेकर दो प्रेमिकाएं भीड़ गईं। दोनों में लात घुसों के बाद एक-दूसरे पर डंडों की बरसात की । pic.twitter.com/z3OJsSfdh1— Hindustan (@Live_Hindustan) July 13, 2022
ఇవి కూడా చదవండి : వీడియో: ఇది పబ్లిక్ ప్లేస్! వద్దంటూ యువకుడు వారిస్తున్నా వినకుండా.. యువతి ఏం చేసిందంటే!