సినిమాల్లోని కొన్ని కోర్టు సీన్ లో లాయర్, నిందితుడు ఒకరిపై ఒకరు తిట్టుకుంటుంటారు. ఇక కోపంతో తట్టుకోలేక కొట్టుకుంటుంటారు కూడా. కానీ, నిజజీవితంలో అచ్చం ఇలాగే ఆగ్రాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతోంది.
సాధారణంగా సినిమాల్లో కోర్టు సీన్ లు చూసినప్పుడు లాయర్ కు, నిందితుడికి మధ్య మాటల యుద్దం నడుస్తుంటుంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటుంటారు. ఇక హద్దులు దాటి సీన్ పండడం కోసం ఏకంగా కోర్టులోనే కొట్టుకుంటుంటారు. ఇలాంటివి మనం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. కానీ, నిజజీవితంలో కోర్టు బోనులో లాయర్, నిందితుడు కొట్టుకోవడం మీరెప్పుడైనా చూశారా? అచ్చం ఇలాంటి ఘటనే ఆగ్రాలో చోటు చేసుకుంది. కోర్టులో వాళ్లిద్దరూ కొట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
ఆగ్రాలోని ఓ ప్రాంతంలో ఓ కోర్టులో ఇద్దరు న్యాయవాదులు ఓ కేసు విషయమై వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఇక ఓ లాయర్ బోనులో ఉన్న నిందితుడిని ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇద్దరి కోపాలు కట్టలు తెంచుకోవడంతో అదే కోర్టులో ఒకరిపై ఒకరు రక్తం వచ్చేలా దాడి చేసుకున్నారు. ఇదంతా కోర్టులో ఉన్న మరికొంతమంది వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. ఈ ఫైటింగ్ సినిమా స్టైల్ లో ఉందటూ కామెంట్స్ చేస్తున్నారు. కోర్టులోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.