వివాహం అంటే.. అమ్మాయి-అబ్బాయి మధ్య జరుగుతుంది. అది ప్రేమ వివాహమే కావొచ్చు.. లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి కావొచ్చు. ఏది అయిన సరే స్త్రీ-పురుషులిద్దరి మధ్యే జరుగుతుంది. ఇక ప్రస్తుత కాలంలో ప్రేమ వివహాలు ఎక్కువ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటికి పెద్దల అంగీకారం ఉంటే.. మరికొన్నింటికి ఉండటం లేదు. అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుంటామంటేనే త్వరగా ఒప్పుకొని కాలంలో.. ఓ పెళ్లి మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం అందరూ ఈ వివాహం గురించే చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: తప్పతాగి.. పెళ్లి చేసుకున్న మగాళ్లు.. మత్తు దిగాక అదిరే ట్విస్ట్!
ఆ పెళ్లి ప్రత్యేకత ఏంటి అంటే.. ఇద్దరు మగాళ్లు.. ప్రేమించుకోవడమే కాక.. పెద్దలను ఒప్పించి మరి.. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో నెట్టింట వైరలవ్వగా.. ఇక కొత్త దంపతులు చేప్పిన డైలాగ్ విని అదుర్స్ అంటున్నారు నెటిజనులు. సాధారణంగా.. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆకర్షణ సహజం. కానీ హర్మోనల్ మార్పుల వల్ల కొందరు తమ జాతికి చెందిన వారినే అనగా.. స్త్రీలు, మహిళలను, పురుషులు.. మగాళ్లను ఇష్టపడతారు. సాధారణ ప్రేమ వివాహాలనే అంగీకరించని మన సమాజంలో.. ఇలాంటి గే ప్రేమ వివాహాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇది కూడా చదవండి: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి ఎప్పుడో చెప్పేసిన తమన్నా!
ఇప్పుడు మనం చెప్పుకుబోయే వ్యక్తులు కూడా అలానే ప్రేమించుకున్నారు. తమ బంధం గురించి ఇంట్లో వాళ్లకు చెప్పి.. వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అయితే ఈ వివాహం ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు వీరికి మద్దతుగా నిలుస్తున్నారు. వీరి ప్రేమను అంగీకరించిన కుటుంబ సభ్యుల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై ఈ దంపతులు స్పందిస్తూ.. ‘‘సమాజం కూడా మారిపోయింది. అమ్మాయిలను నమ్మలేకుండా ఉన్నాం. అందుకే ఇలా మేమిద్దరం వివాహం చేసుకున్నాం’’ అంటున్నారు. మరి వీరి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడ ఆ చదవండి: తనకి కాబోయే భార్య ఎవరో బయట పెట్టిన సుడిగాలి సుధీర్!