మృత్యువు అనేది ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో మరణించేవారు కొందరైతే.. దురదృష్టం వెంటాడి అర్ధాతరంగా తనవు చాలించేవారు ఇంకొందరు. కానీ కొందరు రెప్పపాటు కాలంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని మృత్యుంజయులుగా ఉంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎవ్వరైనా షాక్‌కు గురవ్వాల్సిందే. అందుకు సంబంధించిన వీడియోలు తరచూ మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఆ కోవకు చెందిన ఓ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఓ సింగిల్ రహదారిపై వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి. ఆ రహదారికి ఇరు వైపుల దట్టమైన చెట్లు ఉన్నాయి. దీంతో వాహనదారులకు రోడ్డు ప్రక్క నుంచి వచ్చే వారిని గమనించలేకున్నారు. ఓ బైక్ దాని వెనుక ఓ బస్సు వస్తున్న క్రమంలో సడెన్ గా ఓ బాలుడు సైకిల్ తో రోడ్డుపై వచ్చి బైక్ ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఆ చిన్నారి సైకిల్ పై నుంచి ఎగిరి రోడ్డు పై పడ్డాడు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న బస్సు సైకిల్ పై నుంచి వెళ్లింది. సైకిల్ నుజ్జు నజ్జు కాగా ఆ బాలుడు చిన్న గాయాలతో తృటిలో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బాలుడు యమజాతకుడు రా బాబు..అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Young boy’s The Miraculous Escape : #Accident pic.twitter.com/Rd5nFZIvGW
— Telugu360 (@Telugu360) March 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.