జీవితం అనేది నీటి బుడగలాంటింది. ఏ క్షణంలో జీవితమనే నీటి బుడగ టప్ మంటుందో చెప్పలేము. ఈ క్షణికాల జీవితంలో చాలా మంది పగలు ప్రతీకారలతో జీవిస్తుంటారు. నేటికాలంలో మనిషి జీవితం ఇకా దారుణంగా ఉంది. ఎంతో ఆరోగ్యంగా కనిపించే మనిషి.. క్షణాల్లోనే అనారోగ్యాల పాలనవుతున్నాడు. మరికొన్ని ఘటనలో ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అందరితో హాయిగా, ఎంతో హుషారుగా తెగ ఎంజాయ్ చేసిన వాళ్లు క్షణాల్లో మరణిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. తన స్నేహితుడు పుట్టిన రోజున సందర్భగా అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నాడు ఓ వ్యక్తి. ఆ వేడుకలో ఎంతో హుషారుగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. అంతలోనే నేలపై ఒరిగిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ప్రభాత్ ప్రేమి (45) అనే వ్యక్తి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్ బరేలీ ఓ హోటల్‌లో గురువారం రాత్రి ఆయన స్నేహితుడు మనీష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. ఆ వేడుకకు ప్రభాత్ ప్రేమి హాజరయ్యాడు. ఇక అక్కడ మంచి బాలీవుడ్ పాటలకు అందరు చిందులు వేస్తున్నారు. ప్రభావ్ కూడ మంచి డ్యాన్సర్ కావడంతో .. హుషారుగా సాంగ్స్ కు స్టెప్పులేశాడు. అది చూసి తోటి మిత్రులు విజిల్స్, చప్పట్లతో ప్రభాత్ ను ఫుల్ ఎంకరేజ్ చేశారు. అతడు కూడా మరింత ఉత్సాహంతో డ్యాన్స్ చేశాడు.
అయితే.. ఉన్నట్లుండి ఆయన ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితే కుప్పకూలిన ప్రభాత్ దగ్గరకు వెళ్లి పైకి లేపేందుకు తోటి వారు ప్రయత్నించారు. పార్టీకి వచ్చిన మనీష్ మరో మిత్రుడు డాక్టర్ వినోద్ పగ్రానీ.. ప్రభాత్ కు సీపీఆర్ , కార్డియాక్ చికిత్స చేసిన లాభం లేకుండా పోయింది. చివరకు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
बरेली: खुश दिल इंसान की पल भर में मौत….
◆डांस करते-करते शख्स अचानक गिरा नीचे, डॉक्टरों ने मृत घोषित किया pic.twitter.com/AIOle7W9BA
— News24 (@news24tvchannel) September 2, 2022