కుటుంబంలో గొడవలు సర్వసాధారణం. అందులోను భార్యభర్తల మధ్య జరిగే గొడవలు మనం చాలా చూశాం. కొందరు దంపతులు ఒకరిపైఒకరు భౌతిక దాడులకు కూడా దిగుతుంటారు. చాలా వరకు అత్తమామలు.. కొడుకు కోడలి విషయాల్లో తలదూర్చారు. కానీ ఓ మామ మాత్రం కొడుకు ముందే కోడల్ని చితక్కొట్టాడు. గొడవకు కారణం ఏమిటనేది తెలియరాలేదు కానీ కొడుకు ముందే అతడి భార్యను జుట్టు పట్టుకుని మరి కోట్టాడు ఆ మామ. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీలోని నోయిడా సెక్టార్-121లో ఓ వ్యక్తి.. తన కొడుకు, కోడలతో నివాసం ఉంటున్నాడు. ఆ వ్యక్తి.. కోడలు స్మితి కశ్యప్ మరొక మహిళతో ఏదో విషయంపై వాగ్వాదానికి దిగింది. కొద్దిసేపటికి, గదిలో నుంచి మరో ఇద్దరు మహిళలు బయటకు వచ్చారు. వాదన పెరగడంతో సదరు మామ..తన కోడలు స్మితిని కొడుకు ముందే కొట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో బాధితురాలి సోదరి స్మితా కశ్యప్, సోదరుడు స్మిత్ షాహి, తల్లి సుష్మా సిన్హా ఇంట్లో ఉన్నారు. బాధితురాలి బంధువులు ఇంట్లో ఉన్నప్పటికీ ఈ దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం అంటే ఆగస్టు 10వ తేదీన ఈ దారుణం జరిగింది.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వీడియో పుటేజిని కూడా పోలీసులకు సమర్పించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shocking incident reported from #Noida. Father-in-law thrashes woman in posh #CleoCounty society in front of husband, mother and brother. Hope #NoidaPolice is taking appropriate action.#Stopatrocitiesagainstwoman pic.twitter.com/X2FdGM9QCA
— Aman Dwivedi (@amandwivedi48) August 14, 2022