మనిషి జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఎవరు ఊహించలేరు. దేవుడి పూజాలు చేస్తే పుణ్యం వస్తుంది. అందుకోసం దేవుడి సన్నిధిలో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే ఆ దీపాలే కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతుంటాయి. తాజాగా ఓ మహిళ ఆలయంలో దీపం వెలిగిస్తూ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఓ భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటన ఝార్ఖండ్ లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ఝార్ఖండ్ రాష్ట్రంలో మేదినీనగర్ కుండ్ మొహల్లాలో ఉన్న శివాలయానికి ఓ మహిళ పూజలు చేయాడానికి వెళ్లింది. అక్కడ పూజలు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పుఅంటుకుంది. మంటలతోనే ఆ మహిళ పెద్ద కేకలు వేస్తూ ఆలయం బయటకు వచ్చింది. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి మహిళను ఆస్పత్రికి తరలించారు. మంటల్లో ఆమె శరీరంలోని చాలా బాగం కాలిపోగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు..ఆలయ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఇప్పుడు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.