ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో కొందరు యువకులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంతటితో ఆగక ప్రేమిస్తున్నామని వెంటపడడం, కాదు, కూడదు అంటే అత్యాచారాలు చేసి ఆపై హత్యలకు కత్తులు నూరుతున్నారు. అయితే అచ్చం ఇలాగే ప్రేమ పేరుతో వేధించిన ఓ యువకుడికి కొంతమంది అమ్మాయిలు నడి రోడ్డుపై చుక్కలు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏం జరిగిందనే మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్ జోధ్ పూర్ పరిధిలోని చోపాసాని ప్రాంతం. ఇక్కడే ఉంటున్న ఓ యువకుడు గత కొంత కాలం నుంచి ప్రేమ పేరుతో కొంతమంది అమ్మాయిలను వేధించాడట. దీనిపై అమ్మాయిలు ఇన్నాళ్లు నోరు మెదపకుండా ఉన్నారు. అయితే ఇటీవల ఆ యువకుడు నడి రోడ్డుపై ఓ అమ్మాయిని వేధించినట్లు తెలుస్తుంది. ఇక ఇతడి వేధింపులతో సహనం కోల్పోయిన అమ్మాయిలు అతడి భరతం పట్టాలనుకున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది అమ్మాయిలు కలిసి అతడిని నడి రోడ్డుపై పట్టుకుని చితక్కొట్టారు. ఇదంతా అక్కడున్న కొందరు యువకులు వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత అదే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చాలామంది ఒక్కోరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) January 26, 2023