భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. ఇంతదానికే కొందరు దంపతులు దాడులు కూడా చేసుకుంటుంటారు. అయితే గొరుతో పోయేదాన్ని చివరికి గొడ్డలిదాక తెచ్చుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగక చివరికి హత్యలకు కూడా కత్తులు నూరుతున్నారు. ఇదిలా ఉంటే ఓ భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆ తర్వాత విడిపోయారు. ఈ క్రమంలో కలుసుకుని మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన భార్య.. నడి రోడ్డుపై భర్తపై దాడి చేసింది. అందరూ చూస్తుండగా.. భర్త చొక్కా పట్టుకుని చావబాదింది. ఈ దాడి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.
విషయం ఏంటంటే? ఢిల్లీలోని ఓ ప్రాంతంలో అనూజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను 2021లో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. భార్య టీచర్ గా పని విధులు నిర్వర్తిస్తుండగా.. భర్త మాత్రం స్థానికంగా ఓ కంపెనీలో పని చేస్తుండేవాడు. దీంతో కొంత కాలం పాటు ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంసారాన్ని ఈడ్చుకొచ్చారు. ఇదిలా ఉంటే పెళ్లైన ఏడాదికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
అయితే ఏదో విషయంపై ఇటీవల భార్యాభర్తలు మరోసారి కలుసుకున్నారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన మహిళ.. భర్తను చొక్కా పట్టుకుని నడి రోడ్డుపై చితక్కొట్టింది. దీనిని చూసిన కొందరు వాహనదారులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా… వినకుండా ఆ మహిళ భర్తను చితకబాదింది. దీనిని చూసిన కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ప్రస్తుతం అవి కాస్త వైరల్ గా మారాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
నడిరోడ్డుపై భర్తను చితక్కొట్టిన భార్య pic.twitter.com/fblra0KJNR
— Hardin (@hardintessa143) January 30, 2023